మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. మెగా ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చినా కూడా చాలా పద్దతిగా ఉంటాడు. ఏ మాత్రం పొగరు కనిపించదు. అందరితోనూ కలివిడిగా ఉంటూ మన్ననలు పొందుతూ ఉంటాడు. చాలా రోజుల తర్వాత సాయి ధరమ్ తేజ్ తన తమ్ముడి చిత్రం రంగ రంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనిపించాడు. ఆ ఈవెంట్‌లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. మళ్లీ ఇలా రావడం అనేది నా అదృష్టం. మళ్లీ వస్తాను అని అనుకోలేదు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరంతా ఇంటికి వెళ్తుంటారు. మీరు బైక్ నడిపేటప్పుడు.. హెల్మెట్ వేసుకొని బైక్ నడపండి. మీరు పక్కింటికి వెళ్లినా కూడా హెల్మెట్ పెట్టుకొని వెళ్లండి.
నేను హెల్మెట్ పెట్టుకొన్నా కాబట్టి యాక్సిడెంట్ జరిగినా బతికి బయటపడ్డాను. కాబట్టి మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను. హెల్మెట్ లేకుండా బండి నడపకండి. ప్లీజ్.. ప్లీజ్.. హెల్మెట్ వేసుకోండి. రోడ్డుపైన ఇసుక ఉంటే ఎవరు ఏం చేస్తారు. విధిరాతను ఎవరూ మార్చలేరు. కాబట్టి మీరు హెల్మెట్ వేసుకోండి.. అని సాయిధరమ్ అన్నారు. రంగ రంగ వైభవంగా మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో నాకు యాక్సిడెంట్ అయింది. సినిమా హిట్ అవుతదా ? బ్లాక్ బస్టర్ అవుతదా ? అన్నది నాకు తెలీదు.. మీరు మా తమ్ముడిని యాక్సెప్ట్ చేశారు.. అదే నాకు చాలు.
స్టేజ్ మీదకు ఎక్కినా, కింద ఉన్నా కూడా వీడ్ని ఏడిపించడం నాకు ఇష్టం.. వీడు నవ్వుతుంటే నాకు ఇష్టం.. అదే నాకు సంతోషం.. అదే మన హ్యాపీనెస్.. మీ అందరి ముఖాల్లో నవ్వు కనిపిస్తోంది.. అదే నా హ్యాపీనెస్. నేనేమీ 90 వేయలేదు.. నాకు తాగడం అలవాటు లేదు.. నా తమ్ముడు మంచి యాక్టర్ అని నాకు అనిపిస్తోంది. కాబట్టి థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి అని సాయిధరమ్ తేజ్ అన్నాడు. మొత్తానికి సాయి ధరమ్ తేజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…