చక్కనమ్మ చిక్కినా అందమే. కానీ చూడ చక్కనమ్మ ఇప్పుడు చిక్కిందో లేదో కానీ ఫేస్ మాత్రం మారిపోయింది. దీనికితోడు సమంత అనారోగ్యంతో బాధపడుతుందని అమెరికాలో చికిత్స తీసుకుంటుందని, గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన పెరిగిపోయిన నేపథ్యంలో సామ్ స్పందించింది. తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. యశోదతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా డబ్బింగ్ చెబుతున్న ఫొటోను షేర్ చేస్తూ సుదీర్ఘ పోస్ట్ చేసింది. సామ్ లేటెస్ట్ పోస్ట్‌తో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోయింది.
అందరూ ఆమె త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు. ఇక ఆమె మాజీ భర్త నాగచైతన్య కూడా స్వయంగా హాస్పటల్‌కు వెళ్లి సమంత త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా సమంత ఆరోగ్య పరిస్థితి కాస్త క్రిటికల్‌గా ఉందనేందుకు ఖుషి సినిమా వాయిదాయే కారణం అని కూడా చెపుతున్నారు. వాస్తవానికి ఖుషి సినిమాని డిసెంబర్ 23వ తేదీన విడుదల చేసేందుకు నిర్మాతలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా జారీ చేశారు.
కానీ ఇప్పుడు సమంత అనారోగ్యం బారిన పడటంతో సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విజయ్ దేవరకొండ చెబుతున్నాడు. కానీ దాన్ని సమ్మర్ సీజన్ కి వాయిదా వేసేందుకు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సమంతకు మరి కొద్ది రోజులు విశ్రాంతి అవసరం అని.. ఆమె కోలుకుంటే డిసెంబర్ నుంచి ఖుషి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ లేట్ అయ్యే ఛాన్సులు ఉండడంతో విజయ్ దేవరకొండ కూడా మరో సినిమాను పట్టాలెక్కించే ప్లానింగ్‌లో ఉన్నాడు. అందుకే గీతా, దిల్ రాజు, సితార సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాడట.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…