Salaar First Review : కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్,కేజీఎఫ్ 2 చిత్రాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి బాహుబలి 2: ది కన్‌క్లూజన్ విడుదలైన తర్వాత, ప్రభాస్ యాక్షన్ డ్రామ్ సాహోతో ముందుకు వచ్చాడు, ఇది బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలైమైంది. ఇక రాధే శ్యామ్ ప్రభాస్ ఇమేజ్ కి ఏమాత్రం సెట్ కాలేదు. కథ కథనాల్లో కూడా బలం లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. మరోవైపు ఆదిపురుష్ మూవీపై కూడా ఆశలు పోయాయి. దారుణమైన టీజర్ చూశాక… అభిమానులు కూడా అంగీకరించలేకపోయారు. వందల కోట్ల బడ్జెట్ తో మీరు తీసిన సినిమా ఇదేనా అని దర్శకుడు ఓమ్ రౌత్ పై విరుచుకుపడ్డారు.
ఇక సలార్‌లో అందరిలో భారీ అంచనాలు ఉండగా, ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటించింది. ఇక సలార్ రోజురోజుకు భారీ అంచనాలు అందిపుచ్చుకుంటుంది. మరోవైపు ఈ సినిమాకి సంబంధించి అనేక ప్రచారలు నడుస్తున్నాయొ. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ప్రభాస్ తమ్ముడిగా కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇటీవల సెట్స్ నుండి విజయ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే కొన్ని నివేదికల ప్రకారి ఈ పిక్ సలార్ సెట్స్ నుండి కాదని, ఒక ప్రకటన షూట్ నుండి అని పేర్కొన్నాయి. అయితే, ప్రస్తుతానికి ఏదీ అధికారికంగా ధృవీకరించబడలేదు.
ఇక సంక్రాంతికి రావాల్సిన ఆదిపురుష్ ని వాయిదా వేశారు. విఎఫ్ఎక్స్ వర్క్ నాసిరకంగా ఉందన్న విమర్శల నేపథ్యంలో మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వీలైనంత వరకు డ్యామేజ్ కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. పలు రిపేర్స్ కి గురవుతున్న ఆదిపురుష్ విజయంపై అందరిలో నమ్మకాలు సడలాయనే చెప్పాలి . కెజిఎఫ్ తరహాలో ప్రభాస్ కి కూడా ఒక రికార్డు బ్రేకింగ్ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ టాలెంట్ పై పూర్తి నమ్మకమున్న ఫ్యాన్స్.. తమ కోరిక సలార్ తో నెరవేరుతుందని భావిస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్‌కి ప్రశాంత్ నీల్ మంచి హిట్ అందిస్తాడా అనేది చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…