Sajjala Ramakrishna Reddy : ప్రస్తుతం ఏపీలో రాజకీయం ఏ రేంజ్‌లో సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనసేన, టీడీపీలు వైసీపీపై దుమ్మెత్తిపోస్తుండగా వైసీపీ కూడా వారికి అంతే ధీటుగా బదులిస్తుంది. అయితే తాజాగా చంద్రబాబు, పవన్ చేసిన కామెంట్స్ పై సజ్జల స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చంద్రబాబు సెల్ ఫోన్ లైట్ కనిపెట్టిందనే మాటలు చెబుతున్న వీడియో చూపిస్తూ ఆయనపై విమర్శలు గుప్పించాడు సజ్జల. ఇలాంటి వాళ్లా ప్రజలని పాలించేది, మనల్ని చూసి మనమే జాలి పడాల్సి వస్తుందని అన్నారు సజ్జల. 2014-19 మధ్య చంద్రబాబు ఎందుకు విజన్ డాక్యుమెంట్ చేయలేదు చెప్పాలి. చంద్రబాబు మాట్లాడే మాటలు ఒక విజనరీ అయిన వ్యక్తి మాట్లాడిన మాటలులా లేవు.
వృద్ధాప్యంలోకి వచ్చిన వ్యక్తి మాటలులా ఉన్నాయా ప్రజలే అర్ధం చేసుకోవాలి. టీడీపీ అధినేతను పగటి వేషగాడు అనాలా పిట్టలదొర అని అనాలా. చంద్రబాబు తనను తాను తిట్టుకోవాల్సిన తిట్లు జగన్‌ను తిడుతున్నారు. చంద్రబాబు లాగా 50 ఏళ్ల ప్లాన్లు జగన్ వేయడంలేదు. ఈ ఏడాది ప్రణాళిక వేస్తే వచ్చే ఏడుకే అమలు చేస్తున్నారు అని సజ్జల పేర్కొన్నారు. “జగన్ వైజాగ్ వెళతారు అని తెలియగానే ఒకరి తరువాత ఒకరు అక్కడికి వెళ్లి అక్కడి వాతావరణం చెడగొట్టే ప్రయత్నం చేశారు. వైజాగ్ రాజధాని కాకూడదని వారి కోరిక. అందుకే వారు ఒక రోజు ఓ గుంత దగ్గరకు.. ఇంకోరోజు ఓ గుట్ట దగ్గరకు.. మరో రోజు ఇసుక దిబ్బల వద్దకు వెళుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని పర్యావరణ రక్షణ వారే చేస్తున్నట్టు తిరుగుతున్నారు.
![Sajjala Ramakrishna Reddy : వీడియో చూపించి చంద్రబాబు పరువు తీసిన సజ్జల Sajjala Ramakrishna Reddy comments on chandra babu rakhi video](http://3.0.182.119/wp-content/uploads/2023/08/sajjala-rama-krishna-reddy.jpg)
పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు అన్ని చంద్రబాబుకు సరిపోతాయి. చంద్రబాబు నిలబడడానికి శక్తిలేక పవన్‌ను పెట్టుకున్నారు. పవన్ ఆయన్ను మోస్తున్నారు.” అని సజ్జల మండిపడ్డారు. 45 రోజులుగా రాఖీలకి పూజలు చేస్తున్నానని, అవి కట్టుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయంటూ పగటి వేషగాడిలా చంద్రబాబు మాట్లాడుతున్న చాదస్తపు మాటలు వింటుంటే గొప్ప విజనరీ ఇదేనా అని ఆశ్చర్యం కలుగుతుంది విని సజ్జల పేర్కొన్నాడు.