Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అలానే మీడియా ద్వారా కూడా పలు విషయాల గురించి ప్రజలకి చెప్పుకొస్తున్నారు. రీసెంట్‌ఘా విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్‌పై పవన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. టీడీపీ, జనసేననా? లేక బీజేపీతో కలిసి వెళ్లడమా? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. విశాఖపై ప్రేమతో పాలకులు రాజధాని అని చెప్పడం లేదని, 2004 నుంచి కొన్న భూముల కోసమే విశాఖకు వస్తున్నారని విమర్శించారు.
అభివృద్ది చేయడానికి రాయలసీమలో అవకాశం లేదని, ఉత్తరాంధ్ర వనరులను దోపిడీ చేస్తే అడిగేవారే లేరని ఆరోపించారు. అలానే సాక్షి ఛానల్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ అడ్డగోలుగా ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నారు. జగన్.. రాజకీయ నాయకుడు కాదు.. వ్యాపారి. యువతులు అదృశ్యమైతే సీఎం స్పందించలేదు. వైసీపీ పాలనతో చూస్తే తెదేపా పాలనే మంచిదనిపించింది అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో తప్పొప్పుల గురించి కూడా నేను మాట్లాడను. నేను ఓట్లు చీలకూడదు అనడానికి కారణం సాక్షి పేపర్ ఓనర్ కారణం.
నువ్వు 151 సీట్లు గెలిచి 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యం అయిన లా అండ్ ఆర్డర్ దోచేస్తూ, వేలాది కోట్ల ప్రకృతి వనరులు దోచేస్తుంటే నీ కన్నా టీడీపీ వాళ్లు బెటర్ అనిపించింది. నీ పార్టీ నువ్వేలా నడుపుకోవాలో తెలుసుకోవాలి. నా పార్టీ గురించి నువ్వు ఎవడివి చెప్పుకోవడానికి. మూసుకు కూర్చోమని చెప్పాలని అనిపిస్తుంది. ఒక వ్యక్తి పాలసీ గురించి మాట్లాడితే వ్యక్తిత్వాన్ని దూషిస్తున్నారు.నన్ను వ్యక్తిగతంగా తిడుతుంటే తిట్టకోనివ్వండి నాకేం ఇబ్బంది ఏమి లేదు. ప్రజల కోసం తిట్లు తినడానికి నేను సిద్ధం. రాష్ట్రాలకి వారు కలిగిస్తున్న నష్టాలని ఎప్పుడు పాయింట్ ఔట్ చేస్తున్నాను. మోదీ నాకు సన్నిహితంగా ఉన్నారని స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా లేను కదా అని పవన్ అన్నారు.