Sai Pallavi : లేడి పవర్ స్టార్ సాయి పల్లవి పేరు చెబితే అభిమానులకి పూనకాలు రావల్సిందే. అంతలా తన డ్యాన్స్ తో సందడి చేస్తుంటుంది ఈ భామ. ఫిదా’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి, ఆ సినిమాతో ఎక్కడలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కేవలం ఒక్క సినిమాతోనే అమ్మడికి టాలీవుడ్ అభిమానులు పట్టం కట్టారు. ఇక ఆ తరువాత ఆమె టాలీవుడ్‌లో చేసిన సినిమాలు, ఆమె నేచురల్ యాక్టింగ్, లుక్స్, డ్యాన్స్ ఆమెను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. అయితే ఈ బ్యూటీ ఇటీవల చాలా వైవిధ్యమైన సబ్జెక్టులు ఎంచుకుంటూ వస్తోంది. ఆమె తెలుగులో సినిమా చేయక చాలా రోజులే అవుతుంది. అయితే సాయి పల్లవి డ్యాన్స్ గురించి ఎప్పుడు చర్చ నడుస్తుంది.
సాయి పల్లవి ఓ షోలో తన డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్ తో ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్ధులని చేసింది. నెమలి మాదిరిగా నాట్యం చేస్తూ అందరికి పూనకాలు తెప్పించింది. హిందీ పాటకి సాయి పల్లవి వేసిన స్టెప్పులకి అదరహో అనకుండా ఉండలేము. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న డ్యాన్స్ షోలపై తనకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని.. కేవలం డబ్బు, పరపతి ఉన్న కిడ్స్‌కే డ్యాన్స్ షోస్‌లో అవకాశం, అవార్డులు ఇస్తున్నారని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఒకప్పుడు సాయి పల్లవి కూడా డ్యాన్స్ షోలలో పాల్గొన్న విషయాన్ని ఆమె మర్చిపోయినట్లు ఉందని కొందరు ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఎంతోమంది హీరోయిన్లు ఇలా గ్లామర్ షో చేస్తూ అవకాశాలు అందుకుంటూ ఉండగా సాయి పల్లవి మాత్రం ఎలాంటి గ్లామర్ షో చేయకుండా ఉంటుంది. ఎలాంటి స్టార్ హీరో అయినా తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే నిర్మొహమాటంగా నో చెబుతూ కథ ప్రాధాన్యతగల చిత్రాలను ఎంపిక చేసుకుంటూ సినిమాలలో నటిస్తున్నారు. ఇటీవల ఓ షోలో రామ్ చరణ్ ఎన్టీఆర్ బన్నీ ఈ ముగ్గురితో కలిసి డాన్స్ చేసే అవకాశం వస్తే ముందుగా ఎవరితో చేస్తారు అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు సాయి పల్లవి సమాధానం చెబుతూ ఒకే పాటలోనే ఈ ముగ్గురితో కలిసి డాన్స్ చేయాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు.