Niharika Konidela : ఇటీవలి కాలంలో సెలబ్రిటీల విడాకుల గురించి ఎక్కువగా వార్తలు వింటున్నాం. రీసెంట్‌గా నిహారిక, చైతన్యలు తమ వైవాహిక బంధానికి పులిస్టాప్ పెట్టి అందరికి షాక్ ఇచ్చారు. 2020 డిసెంబర్‌లో వీళ్ళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మెగా కుటుంబం అంతా కలిసి ఒక పండగలా పెళ్లి వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. కరోనా సమయంలో కూడా ఖర్చుకు వెనకాడకుండా కోటలో వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నిహారిక చైతన్య పెళ్లి గురించి నేషనల్ మీడియా కూడా కవరేజ్ చేసే అంత రేంజ్‌లో పెళ్లి జరిగింది. అయితే పెళ్లైన దగ్గర నుండి సరదాగా, సంతోషంగా ఉండే వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ముఖ్యంగా క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ఒకరి మధ్య ఒకరికి గొడవలు ఎక్కువైనట్టు తెలుస్తుంది.
చైతన్య సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ కావడం.. నిహారిక సినిమా ఇండస్ట్రీ నుంచి రావడంతో ఇద్దరికీ అభిప్రాయ బేధాలు ఎక్కువగా వచ్చాయని ప్రచారం జరుగుతుంది. తాము ఇద్దరం ఒకరికి ఒకరం ఇష్టపూర్వకంగా.. అవగాహనతో విడాకులు తీసుకున్నట్టు నిహారిక ప్రకటించారు. చైతన్య కూడా దాదాపు అలానే మాట్లాడినా.. ప్రస్తుతం వీరి మధ్య ఏం జరిగి ఉంటుందా అని అంతా ఆలోచిస్తున్నారు. విడాకుల ప్రకటనకి ముందు చైతన్య మనసు ప్రశాంతత కోసం ఓ ఆధ్యాత్మిక యోగా సెంటర్ కు వెళ్లడం.. తనను ఇక్కడికి వచ్చేలాగా చేసిన వారికి చాలా థ్యాంక్స్ అంటూ ఆయన పోస్ట్ పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది.
అయితే తాజాగా నిహారిక, చైతన్యకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో నిహారిక మాట్లాడుతూ.. తనని కన్న కూతురి కన్నా అత్త మామ చూసుకున్నారు అని చెప్పింది. పెళ్లి తర్వాత తన కన్నా కూడా నిహారికని ఎక్కువగా చూసుకున్నారని చైతన్య కూడా అన్నాడు. తను ఏది కావాలంటే అది బెడ్ దగ్గరకు వచ్చేదని కూడా నిహారిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే చైతన్య తండ్రి విడాకుల తర్వాత ఇలా మాట్లాడని ప్రచారం జరిగింది. తాను ఉద్యోగరీత్యా గౌరవమైన హోదాలో ఉన్నప్పటికీ నిహారిక ఇంట్లో పెద్ద వాళ్లతో ఒక్క రోజు కూడా గౌరవంగా ఉండేది కాదని చెప్పాడట. భర్తతో కలిసి జీవించాలనే ఆలోచన తనకు లేదని, భర్తను, అత్త మామలను గౌరవించడం తెలియదని, తన భర్త పై కనీసం ఎప్పుడూ ప్రేమ చూపించలేదని, అన్నట్టు టాక్.