Sachin Tendulkar : ఓట‌మి త‌ర్వాత బాధ‌లో ఉన్న విరాట్‌, రోహిత్‌ని ఓదార్చిన స‌చిన్

Sachin Tendulkar : ఐసీసీ ప్రపంచ కప్ 2023 తుది పోరులో మరోసారి భారత జట్టుకు పరాభవం తప్పలేదు. గుజరాత్‌లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి క‌ప్ గెలిచి చ‌రిత్ర సృష్టిస్తారిని అంద‌రు భావించ‌గా, ఆ ఆశ‌లు ఆవిరి అయ్యాయి. అద్భుతంగా ఆడిన ఆసీస్ జ‌ట్టు ఆరోసారి వరల్డ్ కప్ విజేతగా ఆవిర్భవించింది.భారత్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సునాయాసంగా ఛేదించి రికార్డు స్థాయిలో 6వసారి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. అయితే మ్యాచ్‌పై ఆస్ట్రేలియా పట్టు సాధించడానికి 5 కీలకమైన టర్నింగ్ పాయింట్లు ఉన్నాయి. స్లో పిచ్‌పై బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ చక్కటి ఆరంభాన్ని అందించడంలో ఫెయిల్ అయ్యాడు. ఒకవైపు రోహిత్ శర్మ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడుతుండగా గిల్ ఇబ్బంది పడుతూ కనిపించాడు.

5వ ఓవర్‌లో శుభ్‌మాన్ గిల్, 10వ ఓవర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాక భారత స్కోరు బోర్డు వేగం అమాంతం పడిపోయింది. 10 ఓవర్లకు 80/2తో పటిష్ఠమైన స్థితిలో టీమిండియా కనిపించింది. కానీ ఆ వెంటనే శ్రేయాస్ అయ్యర్ (4) ఔటవడంతో స్కోరు 81/3గా మారిపోయింది. ఆ తర్వాత వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డ విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ జాగ్రత్తగా ఆడారు కాని స్కోరు వేగం పెర‌గలేదు. బౌండరీలు చూద్దామన్నా కనిపించలేదు. విరాట్ కోహ్లి (54) ఔటయ్యాక భారత్ స్కోరు 148/4గా ఉంది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి రావాల్సి ఉండ‌గా, రవీంద్ర జడేజాని ముందుగా పంపించారు. రన్ రేట్ మెరుగుపరుస్తాడేమోనని భావించినప్పటికీ జడేజా విఫలమయ్యాడు.

Sachin Tendulkar consoled virat kohli and rohit sharma
Sachin Tendulkar

సూర్యకుమార్ యాదవ్ సహజ సిద్ధంగా వేగంగా ఆడుతాడు కాబట్టి అతడినే ముందుగా పంపించి ఉంటే బావుండేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొత్త బంతితో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని తెలిసి కూడా బౌలింగ్ చేయించకపోవడం మైనస్‌గా మారిందని చెప్పాలి. బంతి పాతబడ్డాక సిరాజ్ అంతగా ప్రభావం చూపలేకపోవ‌డం మ‌నం చూసాం.ఇలాంటి త‌ప్పుల వ‌ల‌న టీమిండియా బోల్తా ప‌డింది. అయితే ఓట‌మి త‌ర్వాత సిరాజ్ ఏడ్చేశాడు. రోహిత్ కంట క‌న్నీరు వ‌చ్చేసింది. ఇక కోహ్లీ కూడా చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. అయితే ప్ర‌జంటేష‌న్ స‌మ‌యంలో స‌చిన్ భార‌త ఆట‌గాళ్ల వ‌ద్ద‌కు వ‌చ్చి వారిని ఓదార్చాడు.ధైర్యంగా ఉండాల‌ని అన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago