Sachin Tendulkar : ఐసీసీ ప్రపంచ కప్ 2023 తుది పోరులో మరోసారి భారత జట్టుకు పరాభవం తప్పలేదు. గుజరాత్‌లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముచ్చటగా మూడోసారి కప్ గెలిచి చరిత్ర సృష్టిస్తారిని అందరు భావించగా, ఆ ఆశలు ఆవిరి అయ్యాయి. అద్భుతంగా ఆడిన ఆసీస్ జట్టు ఆరోసారి వరల్డ్ కప్ విజేతగా ఆవిర్భవించింది.భారత్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సునాయాసంగా ఛేదించి రికార్డు స్థాయిలో 6వసారి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. అయితే మ్యాచ్‌పై ఆస్ట్రేలియా పట్టు సాధించడానికి 5 కీలకమైన టర్నింగ్ పాయింట్లు ఉన్నాయి. స్లో పిచ్‌పై బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ చక్కటి ఆరంభాన్ని అందించడంలో ఫెయిల్ అయ్యాడు. ఒకవైపు రోహిత్ శర్మ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడుతుండగా గిల్ ఇబ్బంది పడుతూ కనిపించాడు.
5వ ఓవర్‌లో శుభ్‌మాన్ గిల్, 10వ ఓవర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాక భారత స్కోరు బోర్డు వేగం అమాంతం పడిపోయింది. 10 ఓవర్లకు 80/2తో పటిష్ఠమైన స్థితిలో టీమిండియా కనిపించింది. కానీ ఆ వెంటనే శ్రేయాస్ అయ్యర్ (4) ఔటవడంతో స్కోరు 81/3గా మారిపోయింది. ఆ తర్వాత వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డ విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ జాగ్రత్తగా ఆడారు కాని స్కోరు వేగం పెరగలేదు. బౌండరీలు చూద్దామన్నా కనిపించలేదు. విరాట్ కోహ్లి (54) ఔటయ్యాక భారత్ స్కోరు 148/4గా ఉంది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి రావాల్సి ఉండగా, రవీంద్ర జడేజాని ముందుగా పంపించారు. రన్ రేట్ మెరుగుపరుస్తాడేమోనని భావించినప్పటికీ జడేజా విఫలమయ్యాడు.
సూర్యకుమార్ యాదవ్ సహజ సిద్ధంగా వేగంగా ఆడుతాడు కాబట్టి అతడినే ముందుగా పంపించి ఉంటే బావుండేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొత్త బంతితో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని తెలిసి కూడా బౌలింగ్ చేయించకపోవడం మైనస్‌గా మారిందని చెప్పాలి. బంతి పాతబడ్డాక సిరాజ్ అంతగా ప్రభావం చూపలేకపోవడం మనం చూసాం.ఇలాంటి తప్పుల వలన టీమిండియా బోల్తా పడింది. అయితే ఓటమి తర్వాత సిరాజ్ ఏడ్చేశాడు. రోహిత్ కంట కన్నీరు వచ్చేసింది. ఇక కోహ్లీ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే ప్రజంటేషన్ సమయంలో సచిన్ భారత ఆటగాళ్ల వద్దకు వచ్చి వారిని ఓదార్చాడు.ధైర్యంగా ఉండాలని అన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.