Roja : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వైసీపీ నుండి ఒకవైపు జగన్ విమర్శల వర్షం కురిపిస్తుంటే మరోవైపు రోజా, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి వంటి వారు దారుణమైన విమర్శలు కురిపిస్తున్నారు. రోజా టీడీపీ నాయకులని చీల్చి చెండాతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగ తిరుపతిలోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న రోజా రాష్ట్రంలో దొంగలు, డెకాయిట్స్ లకు గురువు చంద్రబాబు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో నేర్పించడంలో చంద్రబాబు దిట్ట అని మంత్రి ఆర్కే రోజా అభివర్ణించారు.
చంద్రబాబుకు ఇచ్చిన ఐటీ నోటీసులపై టిడిపి నేతలు ఎందుకు నోరు విప్పడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. సినిమాలలో మోహన్ బాబు కలెక్షన్ కింగ్ అయితే దోచుకోవడంలో చంద్రబాబు కలెక్షన్ కింగ్ అంటూ మంత్రి రోజా దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్ అవినీతి అక్రమాలపై సిబిఐ, ఈడి విచారణ జరపాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు పిఏ శ్రీనివాస్ ఇంట్లో వేలకోట్ల అక్రమ ఆస్తులు బయటపడ్డాయని పేర్కొన్న రోజా దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇక త్వరలో చంద్రబాబును తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కేసీఆర్ తరిమేస్తాడు అంటూ సంచలన ఆరోపణలు కూడా చేసింది.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతిరోజు ఉపాధ్యాయులను పూజించాలని పేర్కొన్న రోజా, తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానమని సూచించారు. ప్రతి ఒక్కరూ గౌరవించేది, గౌరవించాల్సింది ఉపాధ్యాయుడినేనని మంత్రి రోజా పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పాఠశాలలను అభివృద్ధి చేసి, విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసింది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఆమె తెలియజేసింది. ఒకప్పుడు నారాయణ, చైతన్య స్కూల్లో చదవడానికి సీటు దొరికేది కాదని, ఇప్పుడు ఆ పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలకు తీసుకువచ్చిన ఘనత వైయస్ జగన్ దేనని పేర్కొన్నారు. కార్పొరేట్ స్కూల్ లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మార్కులు సాధించారని మంత్రి రోజా గుర్తు చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…