Roja : జ‌బ‌ర్ధ‌స్త్ రాకేష్ హీరోగా కొత్త సినిమా.. తెగ మురిసిపోయిన రోజా..

Roja : జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంలో సంద‌డి చేసిన క‌మెడీయ‌న్స్ ఇప్పుడు హీరోలుగా వెండితెర‌పై సంద‌డి చేస్తున్నారు. ఇప్ప‌టికే సుడిగాలి సుధీర్, గెట‌ప్ శీను, చ‌మ్మ‌క్ చంద్ర వంటి వారు ప్ర‌ధాన పాత్ర‌లుగా సినిమాలు రూపొందాయి. ఇప్పుడు రాకింగ్ రాకేష్ హీరోగా సినిమా రూపొందుతుంది. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై గరుడవేగ మేకింగ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 పై ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ఈ సినిమా ప్రారంభం కాగా, గరుడవేగ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు డీవోపీ గా పని చేసిన అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య క‌థ‌నాయిక‌గా న‌టిస్తోంది. చరణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇక ఈ చిత్రానికి తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ క్లాప్ కొట్టాగా.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వ‌హించి సాయి కుమార్ మేకర్స్ కి స్క్రిప్ట్ అందజేశారు. చిత్ర ప్రారంభోత్సవంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఫౌండర్ రాఘవ, విఎన్ ఆదిత్య, ప్రవీణ, అనిల్ కడియాల, ధనరాజ్, తాగుబోతు రమేష్, అదిరే అభి తదితరులు పాల్గొన్నారు. అనంత‌రం అంద‌రూ క‌లిసి కొన్ని మొక్కలు నాటారు. ఈ చిత్రాన్ని ఒక పల్లె మట్టివాసన తెలిసే చిత్రంగా రూపొంద‌నుంద‌ని చిత్ర బృందం తెలిపింది.

Roja making a movie with jabardasth rakesh
Roja

రాకేష్ నా కొడుకు లాంటివాడు. ఎప్పటి నుంచో తనకి లీడ్ రోల్ చేయాలని వుంది. ఈ సినిమాతో అది నెరవేరుతోంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి మరెన్నో సినిమాలు చేసి ప్రజలకు ఆనందాన్ని పంచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని రోజా పేర్కొంది. ఇక త‌నికెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ.. రాకేష్ ప్రతిభావంతుడు. హీరోగా, నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టడం అనందంగా వుంది. రాకేష్ మా గురువు గారు రాళ్ళపల్లి గారి కూడా ఇష్టమైన శిష్యుడు. చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి రాకేష్ మరో పది సినిమాకు చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. మంచి నటుడిగా, నిర్మాతగా గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అని చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలియ‌జేశారు సంతోష్‌.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago