MS Dhoni : టీమ్ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించి మూడేళ్లు అవుతున్నా కూడా ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం ధోని ని అభిమానిస్తారంటే అతి శయోక్తి కాదేమో. ఇప్పటికీ ధోని కనపడితే చాలు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు, అలానే షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చాలా ఆసక్తి చూపుతుంటారు. మహేంద్రుడు ఎక్కడ కనిపించినా చాలు ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు అభిమానులు ప్రయత్నిస్తుంటారు. అయితే.. కొందరు ఈ విషయంలో హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు.
ఇటీవల ఎంఎస్ ధోని ఆయన భార్య సాక్షితో కలిసి విమానంలో ప్రయాణం చేశారు. అయితే.. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత కాసేపటికి సీట్లోనే నిద్రపోయారు. పక్కనే భార్య సాక్షి కూడా ఉన్నారు. అయితే.. విమానంలోని ఒక ఎయిర్‌హోస్టెస్ ధోనీని గమనించింది. అతనంటే ఆమెకు బోలెడు ఇష్టం కావొచ్చు. ఉత్సాహం కనబర్చింది. ధోనీ నిద్రపోతుండగా ఎవరికీ తెలియకుండా వీడియో తీసింది. ఈ వీడియోను సోషల్‌మీడియాలోనూ అప్‌లోడ్ చేసింది. ధోనీ ఇక్కడే ఉన్నారు.. చూడండి అంటూ వీడియో తీసిన ఎయిర్‌హోస్టెస్ నవ్వుతూ పక్కనే ఉండగా, ఆ వీడియో మాత్రం తెగ వైరల్ అయింది. అయితే నిద్రని డిస్ట్రబ్ చేస్తున్నావంటూ కొందరు సదురు ఎయిర్‌హోస్టెస్ తీరుపై ఫైర్ అవుతున్నారు.
ప్రస్తుతం ధోని ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2023లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఈ సీజన్ ముగిసిన వెంటనే మహేంద్రుడు మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం రాంచీలోని తన ఫామ్ హౌస్‌లో కోలుకుంటున్నాడు. ధోని బాగానే ఉన్నాడని, ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నట్లు ఇటీవల ఆయన సతీమణి సాక్షి తెలియజేసింది. కాగా.. ఐపీఎల్ 2023 సీజన్ తనకు ఆఖరిది కాదని 2024 సీజన్ ఆడాలని ఉన్నట్లు గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్ మ్యాచ్ అనంతరం ధోని తన మనసులో మాటను బయటపెట్టాడు. అయితే.. ఇది రానున్న నెలల్లో తన శరీరం సహకరించే దానిపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…