Roja : 1990ల సమయంలో హీరోయిన్‌గా వెండితెరపై అద్భుతాలు సృష్టించిన నటి రోజా. కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషలలోను రోజా తన నటనతో మెప్పించి అలరించింది. రోజా ఏపీలోని చిత్తూరు జిల్లాలో జన్మించారు. తిరుపతి పద్మావతి మహిళా యునివర్సిటీలో చదువుకున్న ఆమె నాగార్జున యునివర్సిటీ లో పొలిటికల్ సైన్స్ లో పీజీ చదువుకుంది. నటనపై ఆసక్తి ఉండడంతో రోజా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో తెగ పాపులారిటీని సంపాదించుకున్న తర్వాత ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఇప్పుడు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలవటమే కాదు.. మంత్రిగానూ పని చేస్తున్నారు. ఇక రాజకీయాల్లోనూ ఆమె ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌ను దక్కించుకున్నారు. తెలుగులో చిరంజీవి సహా అగ్రహీరోలందరితో నటించారు. అలాగే తమిళంలో రజినీకాంత్ సహా టాప్ స్టార్స్ అందరితో నటించి మెప్పించారామె. అయితే సెల్వమణిని వివాహం చేసుకున్న తర్వాత రోజాకి అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో సొంతంగా నిర్మాణ సంస్థని నిర్మించి అనేక సినిమాలు రూపొందించింది. వాటిలో చాలా చిత్రాలకు రోజా భర్తనే దర్శకుడిగా ఉన్నారు.
అయితే రోజా నిర్మించిన సినిమాలకు భారీగా డబ్బు ఖర్చు చేసింది. ఆ సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. ఇక అదే సమయంలో రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి ఆర్థికంగా కూడా చాలా నష్టపోయింది. ఆ సమయంలో జబర్ధస్త్ ఆఫర్ రావడం, దానికి భారీగా రెమ్యునరేషన్ తీసుకోవడంతో ఆర్థికంగా కొంత కోలుకుంది. అలా జబర్ధస్త్ రోజా జీవితంలో కీలకంగా మారింది. ఇక రోజా 2014 లో నగరి నుండి పోటీ చేసిన రోజా ఎమ్మెల్యే గా గెలిచారు. అంతే కాకుండా రెండో సారి కూడా గెలిచి ప్రస్తుతం మంత్రి పదవి లో ఉన్నారు. కాగా రోజా త్వరలో తన కూతురిని కూడా హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…