Samantha : ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా ఉన్న నాగ చైతన్య, సమంత నాలుగేళ్ల సంసారం తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరు విడాకులు తీసుకున్నప్పటి నుండి ఈ ఇద్దరి గురించి ఏదో ఒక విషయం నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది. జీవితంలో కలవబోరని, కొందరేమో కలిసే అవకాశాలు ఉన్నాయని ఎవరికి నచ్చినట్టు వారు కహానీలు చెప్పుకొచ్చారు. అయితే ఏది ఎలా ఉన్నా తాజాగా అభిమానులు అందరూ ఆనందించే ఓ విషయం నెట్టింట హల్‌చల్ చేస్తుంది. త్వరలో నాగ చైతన్య, సమంత కలవబోతున్నారట. వారిని కలపబోతుంది మరెవరో కాదు దర్శకుడు గౌతమ్ మీనన్.
గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో నాగచైతన్య, సమంత కలిసి నటించగా.. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్లడం, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం కూడా జరిగింది. అయితే గతంలో గౌతమ్ మీనన్ ఏ మాయ చేశావె సీక్వెల్ చేస్తానని ప్రకటించగా, అందులో సామ్ – చైతూ నటిస్తారని అన్నాడు. ఇప్పుడు సీక్వెల్‌కి టైం ఆసన్నమైనట్టు తెలుస్తుంది. గౌతం ఇప్పటికే సమంత, చైతూతో మాట్లాడారని ఇద్దరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇన్‌సైడ్ టాక్. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే సమంత గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడంతో ఆమె ఆరోగ్యానికి సంబంధించిన అనేక పుకార్లు తెరమీదకు వచ్చాయి. ముఖ్యంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుందని కొంతమంది పుకార్లు పుట్టిస్తే మరి కొంత మంది ఏకంగా సమంత తల్లి ఆమెను రెండో వివాహం చేసుకోమని పెద్ద ఎత్తున ఒత్తిడి చేయడంతో దాన్నుంచి తప్పించుకోవడం కోసం సమంత తన గర్భసంచి కూడా తొలగించుకుందనే పుకారు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. ఎప్పుడూ పుకార్లపై ఇట్టే స్పందించే సమంత ఈ సారి మాత్రం ఎన్ని రూమర్స్ వచ్చినా నోరు విప్పడం లేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…