Roja : ఇన్‌చార్జ్ మార్పుల‌పై స్పందించిన రోజా.. న‌గ‌రి సీటు నాదేనంటూ కామెంట్..

Roja : ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార వైసీపీలో ఇన్ ఛార్జ్ ల మార్పు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. స‌ర్వేల ఆధారంగా సీఎం జగన్ చేపడుతున్న ఈ మార్పులు చేర్పుల్లో పలువురు మంత్రులకు కూడా ఈసారి టికెట్లు దక్కే పరిస్ధితి కనిపించడం లేదు. ఈ క్రమంలో రోజా స్పందిస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. నగిరిలో ఎవరికి సీటు ఇచ్చినా నేను జగనన్నకు ప్రాణం ఇస్తానని, తనకు ఎమ్మెల్యే సీటు లేదు అనే ప్రచారం కేవలం‌ శునకానందం మాత్రమే అని ఏపి మంత్రి ఆర్.కే.రోజా విమర్శించారు.. మీడియాతో మాట్లాడిన రోజా… ప్రతి రోజు నగరి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు వెళ్తూ, సంక్షేమ పథకాలను అందిస్తూ పల్లె నిద్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని తక్షణమే వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు.

క్యాబినెట్ సమావేశంమైనా, పార్టీ కార్యక్రమాలైనా ఎప్పుడూ తాను ముందు ఉంటానని, పచ్చ మీడియా దిగజారుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఆ అభ్యర్థులను టిడిపికి మళ్ళి చేద్దామని గోతికాడ గుంట నక్కల టిడిపి కాసుకుని కూర్చుందని, జగనన్నపై ప్రజల్లో ఎంత ప్రేమ ఉందో, అంతకు మూడింతలు పార్టీలో మా అందరికీ ప్రేమ ఉందని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి 100% అందరూ కలిసిమెలిసి పని చేస్తామన్నారు. సర్వేల ద్వారా చర్చ జరిపి నిర్ణయం కూడా తీసుకున్నారని, ప్రజల వద్ద జగనన్నకు వ్యతిరేకత లేదని, ప్రజలకు అందుబాటులో లేక సీట్లు లేకపోతే వేరొక పదవి ఇచ్చేలా సీఎం జగన్ చూస్తున్నారని అన్నారు.

Roja interesting comments on nagari seat
Roja

మరోవైపు రాష్ట్రంలో చేపడుతున్న వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల విషయంలో సీఎం జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ఆర్కే రోజా తెలిపారు. ఇన్ ఛార్జ్ లను మార్చే ముందు వారితో ఒకటికి రెండు సార్లు మాట్లాడిన తర్వాతే జగన్ సర్దుబాట్లు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. విపక్ష టీడీపీ-జనసేనకు ఓ మ్యానిఫెస్టో లేదని, సీట్ల సర్దుబాటు కూడా లేదని, వీళ్లు తమ గురించి మాట్లాడుతున్నారని రోజా ఆక్షేపించారు. నగరిలో పెద్దిరెడ్డి వర్గానికి.. రోజాకు సరిపడటం లేదు. పెద్దిరెడ్డి ఆమెకు టిక్కెట్ రాకుండా చేస్తున్నారు. బీసీ అభ్యర్థిని తెరపైకి తెస్తున్నారు. అయినా రోజా … తనకు భ యపడి అయినా సరే టిక్కెట్ ఇస్తారని.. భావిస్తున్నారు. అందులో భాగంగానే… బెదిరింపు స్వరంతో విధేయతా ప్రకటనలు చేస్తున్నారని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago