జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన స్కీమ్స్ నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన బహిరంగ సభలో బటన్ నొక్కి విడుదల చేశారు. ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.680.44 కోట్లను నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. నగరిలో జగనన్న పేరు చంద్రబాబు నాయుడు గుండెల్లో రీసౌండ్ రావాలని అన్నారు. ఒకప్పుడు పెత్తందార్ల ఆస్తి అయిన విద్యను పేదవాడి హక్కుగా మార్చారని అన్నారు. దేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని ప్రముఖ విద్యావేత్త కొఠారి చెప్పిన మాటలను సీఎం జగనన్న అక్షరాలా ఆ మాటను నిజం చేస్తున్నారని చెప్పారు.
జగనన్నకు ఒక చిన్న రిక్వెస్ట్.. అన్నా ఇన్ని లక్షల మందికి విద్యాదీవెన ఇస్తున్నాం.. కానీ ఇంకో ఇద్దరికి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా.. వారు ఎవరో కాదు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. పవన్ ఒక ఇంటర్వ్యూలో ఇంటర్‌లో తను సీఈసీ అని ఒకసారి.. హెచ్‌ఈసీ అని ఒకసారి ఎంపీసీ అంటారు. చంద్రబాబు ఇంజినీరింగ్ చదవాలంటే ఇంటర్‌లో బైపీసీ గ్రూప్ తీసుకోవాలంటారు. వీరిద్దరికీ విద్యాదీవెన వర్తింపజేయాలంటే ఏపీలో వారికి ఇల్లు లేదు ఓటు లేదు. ఆధార్ కార్డు కూడా లేదు. కాబట్టి సీఎంగా మీకు స్పెషల్ పవర్స్ ఉంటాయి. అవి ఉపయోగించి వారిద్దరికీ విద్యాదీవెనతో మంచి చదువు చెప్పించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అంది రోజా.
టీడీపీని నమ్ముకుంటే విద్యార్ధులు జైళ్ళకు వెళతారు, పవన్‌ను నమ్ముకుంటే సినిమాలకు వెళతారు కానీ జగనన్నను నమ్ముకుంటే మంచి కాలేజీలకు, యూనివర్శిటీలకు వెళ్లి జీవితంలో చక్కగా సెటిలవుతారు అని రోజా చెప్పుకొచ్చింది. నాకు ఈ మధ్యే రిలీజయిన రజనీకాంత్ సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది. మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరూ లేదు.. ఈ రెండూ లేని ఊరే లేదు. (ఇదే డైలాగ్ తమిళ్‌లో కూడా చెప్పారు.) పవన్ ఎంత విమర్శించినా.. లోకేష్ ఎంత మొరిగినా.. చంద్రబాబు ఊరూరు తిరిగి ఎన్ని అబద్దాలు చెప్పినా 2024 జగనన్న వన్స్‌మోర్ అని ప్రజలు పట్టం కట్టి 175 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నేను ధైర్యంగా రాయలసీమ గడ్డపై నుంచి చంద్రబాబుకు సవాల్ చేస్తున్నా.. నిన్ను సీఎం చేసిన కుప్పంకు వెళదాం.. అక్కడ ప్రతి ఇంటికి సంక్షేమాన్ని ఇచ్చింది నువ్వా జగనన్నా అడుగుదాం.. నాన్నకొడుకులు గల్లీగల్లీ తిరిగినా ప్రజలు హైదరాబాద్ తరిమితరిమి కొట్టారు అంటూ రోజా విమర్శల వర్షం కురిపించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…