ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్రం ఆయన పేరుతో 100 రూపాయల నాణెం విడుదల చేసింది . ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వారసులు అందరినీ ఆహ్వానించి భార్య లక్ష్మీపార్వతిని మాత్రం పక్కనబెట్టింది. చివరికి అల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా ఆహ్వానించి తనను పక్కనబెట్టడంపై లక్ష్మీపార్వతి ఫైర్ అవుతున్నారు. అయితే ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పురందేశ్వరి చాలా ఎమోషనల్‌గా మాట్లాడింది. ఎన్టీఆర్ ఒక తరం హీరో మాత్రమే కాదని, అన్ని తరాలకు ఆదర్శ హీరో అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని కొనియాడారు.
స్మారక నాణెం విడుదల చేయడం ఎన్టీఆర్‌కు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఎన్టీఆర్ అంటే తెలియని వాళ్లు ఉండరని అన్నారు. “మహిళల సంక్షేమానికి ఎన్టీఆర్ ఎంతో పాటుపడ్డారు. మహిళల ఆస్తిలో హక్కు ఉండాలని ఆయన చెప్పారు. తిరుపతిలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు” అని గుర్తు చేశారు. అయితే పురంధేశ్వరి కామెంట్స్‌పై విజయ సాయిరెడ్డి తనదైన స్టైల్‌లో పంచ్‌లు విసిరారు. పురంధేశ్వరి! ఒక్క క్షణం ఆలోచించమ్మా! అంటూ మొదలుపెట్టి పాత విషయాలన్నీ ప్రస్తావించారు. a) వాటాలు తేల్చుకోలేక మద్రాసులో ఎన్టీఆర్ ఇల్లు పాడు పెట్టేశారు. b) అబిడ్స్ లో అయన ఇల్లు అమ్ముకున్నారు. c) బంజారాహిల్స్ లో ఆయన మరణించిన ఇల్లు పడగొట్టి అపార్ట్మెంట్ లు కట్టుకుని అద్దెకిచ్చారు.
d) దానికి ఎదురు ఉన్న అయన ఇంట్లో మ్యూజియం పెట్టాలనుకున్నారు. అయన ఆశయాలకు నీళ్ళుకొట్టారు. 2/2. తండ్రిపై ప్రేమ గుండెలోతుల్లో హృదయ అంతరంగం నుంచి రావాలేకానీ…పేపర్లు, టీవీల్లో కాదు చెల్లెమ్మా! e) సమాధి తప్ప ఆయనకు స్మారకచిహ్నం కూడా లేకుండా చేసి ఇప్పుడు 100 రూపాయల నాణెం అంటారు. f) భారతరత్న గురించి మీరు ఢిల్లీలో ఏనాడు అడగలేదు. రాజకీయ పూర్వాశ్రమంలో మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన అప్పటి మీ నాయకురాలు సోనియాకు మీరు చెప్పిన హృదయపూర్వక కృతఙ్ఞతలు మరచిపోలేమమ్మా! అంటూ తన తండ్రి దివంగత ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుంటూ పార్లమెంటులో ఆయన విగ్రహావిష్కరణపై గతంలో పురందేశ్వరి పెట్టిన పోస్టును కూడా జత చేశారు విజయసాయి రెడ్డి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…