Mannara Chopra : ఇటీవల హీరోయిన్స్ కి అనేక ఇబ్బందులు ఎదురవుతుండగా,వారు తాము ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఓపెన్‌గా చెప్పుకొస్తున్నారు. దర్శన నిర్మాతలు, హీరోలపై దారుణమైన కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో చాలా మంది హీరోయిన్స్‌తో సన్నిహితంగా మెలగాలన్నా కూడా వణికిపోతున్నారు. కాని ఓ దర్శకుడు మాత్రం ఏకంగా అందరి ముందు ఓ భామకి ముద్దు పెట్టేశాడు. యజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు ఏ.ఎస్ రవికుమార్ చౌదరి తాజాగా చేసిన ఓ పనిపై నెటీజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రవికుమార్ చౌదరీ, రాజ్ తరుణ్ తో తిరగడబారా సామి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మన్నారా చోప్రా కీలకపాత్ర చేస్తుంది. కాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు ఏఎస్ రవి కుమార్.. మన్నారా చోప్రాకు మీడియా ముందే ముద్దిచ్చాడు. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులేమిటని మండిపడుతున్నారు. హీరోయిన్స్‌తో ప్రవర్తించే విధానం తప్పు అంటూ కొందరు అతడిని తిట్టిపోస్తున్నారు. హీరోయిన్‌లతో చిలిపి చేష్టలు చేయడం పద్దతి కాదని, ఇలాంటి వాళ్లను ఊరికే వదిలి పెట్టకూడదని అంటున్నారు. అంతేకాకుండా హీరోయిన్లు కూడా వీటిపై గట్టిగా రియాక్ట్ అవ్వాలని, వాటిని ప్రతిఘటించాలని కామెంట్లు పెడుతున్నారు.
గతంలో ఇలాంటివి కూడా చాలానే జరిగాయి. ఓసారి సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు స్టేజ్ మీదే కాజల్‌కు ముద్దు పెట్టిగా.. అది ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చివరికి కాజల్‌తో ఉన్న సాన్నిహిత్యంతోనే అలా చేశానని చోటా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరీ ఏఎస్ రవికుమార్ తను చేసిన పనికి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. మనోడు గతంలో పలు వివాదాలలో ఇరుక్కున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…