ఢిల్లీలో ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి లక్ష్మీ పార్వతిని ఆహ్వానించకపోవడం పట్ల లక్ష్మీ పార్వతి మండిపడింది ఉద్దేశపూర్వకంగానే తనకు ఆహ్వానం రాకుండా అడ్డుకున్నారని.. ఎన్టీఆర్ భార్యగా తనకు హాజరయ్యే హక్కు ఉందన్నారు. తనను ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారా లేదా అన్నది చెప్పాలని నిలదీశారు. ఇన్నాళ్లూ ఎన్టీఆర్ కుటుంబంపై గౌరవంతో మౌనంగా ఉన్నానని.. ఇకపై వారిని వదిలేది లేదన్నారు. అలాగే పురందేశ్వరి, చంద్రబాబుతో కలిసి కుట్రలు చేశారని.. నేటి నుంచి ఆమెపై పోరాటం ప్రారంభమైందన్నారు.చంద్రబాబు, పురందేశ్వరి, బాలకృష్ణ అందరినీ బయటకు లాగుతానన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత వీళ్లు రాజకీయాల్లో ఉండకుండా చేస్తానన్నారు. వీళ్ల గురించి ఎన్టీఆర్ ఏమన్నారో ప్రజలకు వివరిస్తానన్నారు.
చంద్రబాబు విలనిజం బయటకు కనిపిస్తుంది, కాని పురంధేశ్వరి అంతా లోలోపల నడిపిస్తుంది. అమాయకులైన పిల్లలతో ఆడుకుంటుంది. భువనేశ్వరి, పురంధేశ్వరి ఇద్దరు కూడా అసలు విలన్స్ అన్నట్టుగా లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చింది.ఎన్టీఆర్ కష్టాల్లో ఉంటే పురందేశ్వరి వచ్చారా అని ప్రశ్నించారు. తనను ఎందుకు చులకన చేస్తున్నారని.. తనను చులకన చేస్తే ఎన్టీఆర్‌ను చేసినట్టే అన్నారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు బయటకి వెన్నుపోటుకు ఇంటర్నల్‌గా పురందేశ్వరి ప్రధాన కారకురాలని విమర్శించారు. పురందేశ్వరి రాజకీయాల్లోకి వద్దనడంతో ఎన్టీఆర్‌పై కుట్ర చేశారన్నారు. తండ్రిపై కోపంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారన్నారు. ఇప్పుడు మళ్లీ బావామరదళ్ల ఏకమైపోయారని.. పురందేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీకి పనిచేయడం ఏంటన్నారు.
భువనేశ్వరి, పురందేశ్వరిలు తండ్రికి ద్రోహం చేశారని.. కేంద్రం భారతరత్న ఇస్తానంటే పురందేశ్వరి అడ్డుకున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రిగా ఉండి ఆమె అవినీతి చేశారని.. ఈరోజు నుంచి ఆమెపై తాను పోరాటం చేస్తాన్నారు.. చంద్రబాబు, పురందేశ్వరిని ఇంటికి పంపిస్తానన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందిందో లేదో తనకు తెలియదన్నారు లక్ష్మీపార్వతి. తారక్ ఢిల్లీ వెళితే చంద్రబాబుతో కలపాలని ప్రయత్నం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆహ్వానం అయితే జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యేవారన్నారు. ప్రైవేటు ఫంక్షన్ కనుకే ఆయన హాజరు కాలేదన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ పురందేశ్వరి చదువుతున్నారని.. సీఎం వైఎస్ జగన్‌కి వ్యతిరేకంగా భయంకర కుట్రలు చేస్తున్నారన్నారు లక్ష్మీ పార్వతి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…