Roja : ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో రోజా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం నటి, వైసిపి మంత్రి రోజా పై తెలుగు దేశం పార్టీకి చెందిన విశాఖ సీనియర్ బిసి నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి చేసిన విమర్శలను ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఖండిస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన కొంత మంది సీనియర్ నటీమణులు వీడియోలు చేసి తమ సాంఘీక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ రోజాకి సపోర్ట్ చేస్తూ పెట్టిన ఈ వీడియోలు ఇప్పుడు ట్రోలింగ్ కు గురవుతున్నాయి.
అయితే ఆలా పెట్టినవాళ్ళు కేవలం వాళ్ళచేత ఎవరో పెట్టించినట్టుగా ఈ వీడియోస్ పోస్టు చేసి పెట్టరేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంతకు ముందు రోజా వైసిపి ఎంఎల్ఎ గా ఉన్నప్పటినుంచి, అటు అసెంబ్లీలో రోజా చేసిన అసహ్యకరమైన చేష్టలు, కులహంకారంతో ఎస్సిలను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్, ఎపిలో మహిళలపై జరుగుతోన్న అగాయిత్యాలు ఈ నటీమణులకు లకు కనబడటం లేదా అని నెటిజన్స్ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బండారు వ్యాఖ్యలపై దీటుగా స్పందించిన రోజా.. బండారు లాంటి చీడ పురుగుల్ని ఏరిపారేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళను ఒక మాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలన్నారు. ఆ దిశగా చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని తక్షణమే రిమాండ్‌కు తరలించేలా చట్టాలు కఠినంగా ఉండాలన్నారు. బండారుపై న్యాయ పోరాటం చేస్తానన్న మంత్రి రోజా.. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు వెళ్తానని చెప్పారు. బండారుపై క్రిమినల్, సివిల్ పరువునష్టం దావాలు వేస్తానని రోజా తెలిపారు. ఇక రోజా తాజాగా ఓ కార్యక్రమానికి ఆలీతో కలిసి హాజరైంది. ఆ సమయంలో చాలా మంది జనాలు అక్కడికి చేరుకోవడంతో ఆమె సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కాని ఒకడు సడెన్‌గా వచ్చి ఆమెని కొట్టి వెళ్లాడని, సెక్యూరిటీ అంత అజాగ్రత్తగా ఉండడంతో రోజా వారిపై సీరియస్ అయ్యారని టాక్ నడుస్తుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…