Balakrishna : నట సింహం బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘భగవంత్ కేసరి’. అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కానుండగా, చిత్ర ప్రమోషన్స్ జోరందుకున్నాయి. రీసెంట్‌గా వరంగల్‌లో చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ కార్యక్రమం పెద్ద ఎత్తున జరగగా, ఈ కార్యక్రమంలో బాలయ్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. పోరాటాల పురిటి గడ్డగా పేరొందిన వరంగల్ ప్రజలు, నా అభిమానులందరికీ శుభాభినందనలు. నాకు వరంగల్‌తో అనుబంధం ఉంది. దసరా నవరాత్రులకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఆ భద్రకాళి అమ్మవారే నన్ను ఇక్కడికి రప్పించారనుకుంటున్నా.
సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మలాంటి ఎందరో పోరాట యోధులను స్మరించుకుంటున్నా. పెండ్యాల రాఘవయ్య వరంగల్ ఎంపీగా, హనుమకొండ ఎమ్మెల్మేగా, వర్దన్నపేట ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 1984లో నాన్న గుడివాడ, హిందూపూర్, నల్గొండ నుంచి పోటీ చేసి, మూడు చోట్లా విజయం సాధించారు. నేను ఈ సినిమాలో తెలంగాణ మాండలికంలో సంభాషణలు చెప్పా. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనమున్న సినిమాలు అందించాలనేదే నా తాపత్రయం. దసరా ముందు దంచుదాం. కొత్త సినిమా చేసేముందు నేను నా పాత చిత్రాల గురించి దర్శకులతో చర్చించను. ప్రతి సినిమాని సవాలుగా స్వీకరిస్తా. చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు నేను చేయగలిగానంటే దానికి కారణం ఆయా సినిమా బృందాల సమష్టి కృషి’’ అని బాలయ్య చెప్పుకొచ్చాడు.
శ్రీలీలకు తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇవ్వాలని భావిస్తే మోక్షజ్ఞ తనను తిట్టాడని బాలకృష్ణ చెప్పారు. ‘ఓవైపు నేను హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంటే ఆమెకు ఆఫర్ ఇస్తావా.. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా?’ అని మోక్షజ్ఞ తిట్టినట్లు తెలిపారు. ఈమేరకు తన కొత్త సినిమా భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ వేడుక కోసం బాలయ్య వరంగల్ వచ్చారు. ఈ వేదికపై మాట్లాడుతూ.. ఈ సినిమాలో శ్రీలీల తన కుమార్తెగా నటించిందని చెప్పారు. తర్వాతి సినిమాలో హీరోహీరోయిన్లుగా చేద్దామని శ్రీలీలతో చెప్పానని వివరించారు. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పగా.. మోక్షజ్ఞ తనపై మండిపడ్డాడని బాలకృష్ణ తెలిపారు. ఇక బాలకృష్ణ.. తన కొడుకుని శ్రీలీలకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాడని, ఈ విషయం తెలిసి ఆమె షాక్ అయిందని ఓ ప్రచారం నడుస్తుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…