CM YS Jagan : ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. మరి కొద్ది రోజులలో ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు అందరు ప్రచారాలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఏపీ సిఎం జగన్ పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఎన్నికలు జరుగుతాయని పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు. పార్టీ వ్యవస్థలో అత్యంత కీలకమైన మండలస్థాయి నాయకుల నుంచి మంత్రుల వరకు ప్రజాప్రతినిధులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో మార్గ నిర్దేశం చేశారు.
తెలంగాణతోపాటు 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారని పుకార్లు వస్తున్న నేపథ్యంలో జగన్ క్లారిటీ ఇస్తూ.. ఫిబ్రవరిలో మేనిఫెస్టో.. మార్చిలో ఎన్నికలు ఉంటాయని అన్నారు. అక్టోబరు 25 నుంచి డిసెంబర్ 21 వరకు బస్సు యాత్ర చేపట్టబోతున్నానని జగన్ ప్రకటించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో బస్సు యాత్రలు కొనసాగుతాయని, ప్రతిరోజు మూడు సమావేశాలు ఉంటాయని వెల్లడించారు.మూడు ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మూడు రాజధానులను రూపొందిస్తామని జగన్ చెప్పారు. మేనిఫెస్టోని 99% హామీలను అమలు చేశామని, గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని జగన్ అన్నారు. ఏపీకి జగన్ ఎందుకు రావాలో చెప్పేందుకే ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
చంద్రబాబుని ఎలక్షన్స్ వరకు జైలులోనే ఉంచాలని జగన్ ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జగన్ తొలిసారి చంద్రబాబు అరెస్ట్ గురించి స్పందిస్తూ.. తనకి చంద్రబాబు అరెస్ట్‌కి సంబంధం లేదని అన్నారు. కక్ష సాధింపు నిజం అనుకుంటే, కేంద్రంలో బిజేపీ ఉంది, దత్త పుత్రుడు బీజేపీతోనే ఉన్నానని ఇప్పటికీ అంటున్నాడు, ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు సగం టీడీపీ నేతలు బీజేపీలోనే ఉన్నారు కదా , చంద్రబాబు అవినీతిని గుర్తించి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు తప్ప ఇది కక్ష సాధింపు కాదు అని జగన్ అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…