Sreeleela : నాకు నాన్న లేడు.. బాల‌య్య కండ్లలో నీళ్లు తెప్పించిన శ్రీలీల‌..

Sreeleela : బాలకృష్ణ కథానాయకుడిగా అనీల్ రావిపూడి తెర‌కెక్కించిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’ . ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటించారు. శ్రీలీల ముఖ్యభూమిక పోషించారు. కాగా, ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి హనుమకొండలో నిర్వహించారు. బాలకృష్ణ, కాజల, శ్రీలీల సహా చిత్ర యూనిట్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలీల, కాజల్‌ స్టేజ్‌పై బతుకమ్మ ఆడిపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు గూస్‌ బంప్స్‌ తెప్పించే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందించిన ఎస్‌ థమన్‌ మరోసారి సంగీతం అందిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.

చిత్రంలో బాల‌య్య కూతురిగా శ్రీలీల న‌టించింది. ఆమె ఈవెంట్‌లో చాలా ఎమోష‌న‌ల్‌గా మాట్లాడింది. సినిమా గురించి మాట్లాడిన అనంతరం బాలయ్యతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడింది. శ్రీలీల తండ్రి ఆమె చిన్నప్పుడే వాళ్ళ అమ్మతో విడాకులు తీసుకొని దూరంగా వెళ్లిపోయారు. దీంతో శ్రీలీల చిన్నప్పుడు తండ్రి ప్రేమకు దూరమైంది. అది గుర్తు చేసుకుంటూ ఇండైరెక్ట్ గా నేను లైఫ్ లో చూడలేని అనుభవాలు బాలయ్య గారు ఈ సినిమాతో ఇచ్చారు అని చెప్తూ ఎమోషనల్ అయింది. ప్రతి సినిమాలో సోల్ క్యారెక్టర్ దొరకదు. ఈ సినిమాలో విజ్జి పాప క్యారెక్టర్ లో అది ఉంది. ఆ క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యాను. ఈ రోల్ చేయడం నా అదృష్టం.

Sreeleela emotional speech about balakrishna
Sreeleela

అనిల్ రావిపూడి ఈ క్యారెక్టర్ ని చాలా బాగా రాసారు. ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు అనిల్ గారికి రుణపడి ఉంటాను. కొన్ని సీన్స్ లో కట్ చెప్పిన తర్వాత కూడా అదే మూడ్ లో ఉంటే బాలయ్య గారు నవ్వించేవారు. అంతలా కనెక్ట్ అయ్యాను ఈ సినిమాకు. నా లైఫ్ లో నాకు ఏ అనుభవాలు అయితే లేవో అవి ఈ సినిమాతో బాలయ్య గారు ఇచ్చారు. ఇది ఒక అందమైన కథ అని చెప్తూ ఎమోషనల్ అయింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బాలయ్య గారు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ చిత్రంలో చాలా బ్యూటీఫుల్ సీన్లు ఉన్నాయి. సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా గుర్తుండిపోతాయి. బాల‌య్య‌ది మంచి మనస్సు అంటూ శ్రీలీల ఎమోషనల్ అయ్యింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago