Roja : అమ్మాయిల గురించి త‌ప్పుగా మాట్లాడే బాల‌య్య మీసం తిప్పుతున్నాడా.. రోజా ఫైర్..

Roja : చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత బాల‌య్య రాజ‌కీయాల‌లో చాలా యాక్టివ్ అయ్యారు. త‌మ ప్ర‌త్య‌ర్ధులు అయిన వైసీపీ నాయ‌కుల‌పై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మీసం మెలేయడంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, ప్రముఖ నటి ఆర్కే రోజా మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు మొదలైన కొద్దిసేపటికో గందర గోళం నెలకొంది. సభలో చంద్రబాబు అరెస్ట్‌పై వాయిదా తీర్మానానికి టీడీపీ పట్టుబట్టింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ప్రారంభమైన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా ప్రారంభమయ్యాయి.

అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. స్కిల్ స్కాం కేసుపై అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష టీడీపీ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. స్పీకర్‌ పోడియం వద్దకు టీడీపీ సభ్యులు చేరుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పోడియం ఎక్కి ఆందోళన చేయడంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ అసెంబ్లీలో మీసం మెలియడం పై పలు విమర్శలు చెలరేగాయి.దీనిపై దీనిపై ఏపీ మంత్రులు అంబటి రాంబాబుతో పాటు ఏపీ మంత్రి రోజా బాలయ్యపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Roja angry on balakrishna for his behavior in ap assembly
Roja

ఎప్పుడూ షూటింగ్‌లకు వెళ్లడం, సినిమా ఫంక్షన్లలో ఆడపిల్ల కనబడితే ముద్దు పెట్టండి, కడుపు చేయండి అని ఆడవాళ్లను గౌరవం లేకుండా మాట్లాడడం, నియోజకవర్గాన్ని గాలికి వదిలేయడం, అసెంబ్లీకి రాకపోవడం.. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు నువ్వొచ్చి మీసం మెలేస్తే ఇక్కడ భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు. రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఉంది. ఇంకా క్లారిటీ కావాలి అంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ఎలా జరిగింది? దానిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతుంది? ఆ తర్వాత అచ్చెన్నాయుడు పాత్ర ఎంతుంది? అనేది స్పష్టంగా వివరిస్తారు. ప్రజా డబ్బును దోచుకున్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు’ అని రోజా అన్నారు. ఇక బాలకృష్ణ ప్రవర్తనను ఉద్దేశించి ఆయన సినిమా డైలాగ్‌తోనే పంచ్ ఇచ్చింది రోజా. ‘ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం లాంటి జగన్ మోహన్ రెడ్డి ముందు కాదు’ అంటూ త‌న‌దైన శైలిలో పంచ్ వేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago