Rohit Sharma : ఈ ఏడాది టీమిండియా మంచి జోరు మీదుంది. యువ క్రికెటర్స్‌తో రోహిత్ శర్మ మంచి విజయాలు సాధిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ ల సిరీస్ ఆడుతున్న టీమిండియా జట్టు తొలి మ్యాచ్‌లో ఓటమి చెందినప్పటికీ తర్వాతి మూడు మ్యాచ్‌లలో మంచి విజయం సాధించి సిరీస్ గెలుచుకున్నారు.కొందరు ఆటగాళ్లు దూరం కావడానికి స్పష్టమైన కారణాలు ఉన్నా.. స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ విషయంలో గందరగోళం నెలకొంది. టీమ్ మేనేజ్‌మెంట్ సూచనలను అతడు ఏమాత్రం పట్టించుకోలేదు. శ్రేయస్ అయ్యర్ విషయంలో కూడా ఇదే జరిగింది. దీంతో అందరూ అనుకున్నట్లే వీరిద్దరిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి చర్యలు తీసుకుంది.
ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వివిధ కారణాలతో జాతీయ జట్టుకు దూరం కాగా, వారిద్దరు రంజీలు ఆడాలని బీసీసీఐ వీరికి తేల్చి చెప్పినా వినలేదు. దీంతో బోర్డు వీరి సెంట్రల్ కాంట్రాక్ట్‌లను తొలగించింది. బుధవారం ప్రకటించిన కాంట్రాక్ట్ గ్రేడ్‌ల నుంచి ఇషాన్, శ్రేయస్‌లను పక్కన పెట్టింది. వాస్తవానికి ఆడేందుకు ఫిట్‌గా ఉన్నప్పటికీ వీరు రంజీలు ఆడేందుకు నిరాకరించారు. దీంతో క్రమశిక్షణా రాహిత్యానికి మూల్యం చెల్లించుకున్నారు. దేశవాళీ క్రికెట్ ఆడనంత మాత్రానా గతేడాదిగా భారత జట్టుతో ఉంటూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌ల కాంట్రాక్ట్‌లను తొలగించడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ముంబై తరఫున రంజీ ట్రోఫీకి దూరం కావడానికి గాయాలే కారణమని శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. అయితే అతనికి అలాంటి సమస్యలు ఏవీ లేవని NCA ఫిట్‌నెస్ నిపుణులు బీసీసీఐకి చెప్పండం గమనార్హం.ఈ క్రమంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ .. ఇషాన్, శ్రేయస్ పేర్లను పేర్కొనకుండా రెడ్-బాల్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. టెస్ట్ క్రికెట్ పట్ల నిబద్ధతను ప్రదర్శించే, రాణించాలనే కసితో ఉండే ఆటగాళ్లకు మేనేజ్‌మెంట్ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నాడు. తనతో సహా మేనేజ్‌మెంట్, సపోర్టు స్టాఫ్, సెలక్టర్లు టెస్టు క్రికెట్‌పై ఎవరు శ్రద్ధతో ఉన్నారు, ఎవరు లేరో సులభంగా చూడగలరని రోహిత్ తెలిపాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…