Vidadala Rajini : ప్రస్తుతం ఏపీలో రాజకీయం వేడెక్కుతుంది. టీడీపీ, వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక, గెలుపుపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ కాస్తా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని నియోజకవర్గాలకు ఇంఛార్జులను ప్రకటించింది. ఎలాగైనా మరోసారి తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేస్తోంది.ఈ క్రమంలో గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన గుంటూరు పశ్చిమ సీటులో ఈసారి అభ్యర్ధి ఎవరనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ సీటుకు వలసవచ్చిన మంత్రి విడదల రజనీపై పోటీకి ఎవరైతే బావుంటుందనే దానిపై టీడీపీ అధిష్టానం చర్చలు జరుపుతోంది.
219 ఎన్నికల్లో టీడీపీ 23 నియోజకవర్గాల్లో గెలుపొందగా.. వారిలో నలుగురు ఎమ్మెల్యేలు జంప్ జలానీ అయ్యారు. వైసీపీ కండువా కప్పుకుని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మిగిలిన 19 స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులే బరిలో దించాలని టీడీపీ యోచిస్తోంది. మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మరోసారి గెలుస్తుందని సర్వే రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. దీంతో నూతన అభ్యర్థులను బరిలో దించాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో గన్నవరం నియోజకవర్గం నుంచి యార్లగడ్డ వెంకట్రావును బరిలో దింపనున్నారు. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై చంద్రబాబు స్ఫెషల్ ఫోకస్ పెట్టారు. వాస్తవానికి ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన మద్దాలి గిరి వైసీపీకి మద్దతు ఇస్తున్నారు.
కానీ, ఇప్పటికే ఈ స్థానం రెండు సార్లు గెలిచిన టీడీపీ ఆ నియోజకవర్గంలో హ్యాట్రిక్ గెలుపు సాధించాలని కసరత్తు చేస్తుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జుగా ఇప్పటికే మంత్రి విడదల రజినీ కొనసాగుతున్నారు. దీంతో ఆమెకు ధీటుగా మహిళా అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ తరుణంలో ఎలాంటి రాజకీయ అనుభవం, ఏ మాత్రం రాజకీయ పరిచయం లేని ప్రముఖ పారిశ్రామిక వేత్త వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామలను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. శ్రీ లక్ష్మి శ్యామల… కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డెయిరీ వ్యాపారం ద్వారా పాడి రైతులకు అండగా నిలిచారు. అదే సమయంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలను శ్రీ లక్ష్మీ శ్యామల నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలు పార్టీ కీలక నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీ తరఫునఈ మహిళను పోటీలో నిలబెడితే… గత ఎన్నికల్లో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారట.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…