RK Roja : అధికారంలో ఉన్నంత కాలం తూటాల్లాంటి డైలాగ్స్ తో వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా ఉంది రోజా. అయితే ఎప్పుడేతే ఓటమి పాలైందో అప్పటి నుండి కనిపించడం మానేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేని రోజా ఆ తర్వాతే నగరికి దూరంగా ఉంది. అడ్రస్ లేకుండా పోయిందన్న ప్రచారానికి తెర తీసింది. ఈ రెండు నెలల్లో ఒకటి రెండుసార్లు మాత్రమే చుట్టపు చూపుగానే నగరికి వచ్చి జనానికి కనిపించిన రోజా ఇప్పుడు పక్క రాష్ట్రం తమిళనాడులోనే ఎక్కువగా ఉంటోంది. కుటుంబంతో కలిసి ఆలయాల చుట్టూ తిరుగుతోంది. మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని భావించిన రోజాకి తీవ్ర నిరాశే ఎదురైంది.
అయితే ఇటీవల తమిళనాడులోని ఓ ఆలయ సందర్భనకు వెళ్లిన ఆమె వివాదంలో కూరుకుపోయారు. అభిమానులు సెల్ఫీ దిగడానికి వచ్చిన సందర్భంలో పారిశుద్ద కార్మికులను దూరంగా ఉంటాలని వివక్ష చూపడం కూడా ఆమె విమర్శలకు గురైంది. ఇక ఆమె తమ కుటుంబంతో కలిసి యూరప్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పొట్టి, చిట్టి దుస్తులతో దర్శనమిచ్చారు. దాంతో ఆమె తీరును చూసి నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. మహిళలంటే చీరకట్టు, నుదుట బొట్టు పెట్టుకోవాలి. అలా వెస్ట్రన్ దుస్తుల్లో మగరాయుడిలా కనిపిస్తారా అంటూ నీతులు చెప్పిన వీడియోను షేర్ చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటి ముట్టనున్నట్టు ఉంటున్న రోజా ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఆమె తన భర్త సొంత రాష్ట్రంలో తమిళనాడులో సెటిల్ అయ్యే ప్లాన్స్ చేప్తున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.గత కొద్ది రోజులుగా రోజా పొలిటికల్ కెరీర్ పైన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా దీనిపైన ఇప్పటివరకు రోజా స్పందించలేదు. ఇది నిజమా.. అబద్దమా.. తన రాజకీయ భవితవ్యం ఏంటి అన్న విషయం పైన రోజా ఇప్పటివరకు మాట్లాడలేదు. దీంతో కూడా ఆమె రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకుంటారన్న అనుమానం బలపడుతుంది. సినీ నటుడు విజయ్ ప్రారంభించిన పార్టీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. నగరిలో సొంత పార్టీలే తనను ఓడించారని ఆరోపణలు చేయడం చూస్తే ఆమె తెలుగు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తున్నది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…