Actor Rajendra Prasad : ఒకప్పుడు హీరో కమ్ కమెడీయన్‌గా ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు రాజేంద్రప్రసాద్. ఆయన సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే వయస్సు పెరిగాక హీరోగా తప్పుకున్న రాజేంద్ర ప్రసాద్ సపోర్టింగ్ పాత్రలు అలానే కీలకమైన పాత్రలు పోషించాడు. చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో.. వచ్చిన ఒక గొప్ప సందేశంతో వచ్చిన ఆ నలుగురు చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. . ఈ సినిమా 2004లో వచ్చిన ఓ ప్రత్యెక సినిమా. మంచి కథా బలంతో నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ నటన అపూర్వం. మనం ఎంత బాగా జీవించినా, ఎంత ధనం సంపాదించినా మనకు కావలసింది ఆ నలుగురు మనుషులే అనే మూల సిద్ధాంతం మీద తీసిన నంది ఉత్తమ చిత్రం ఇది.
పరుల సేవయే పరమార్థంగా భావించే రఘురాం పాత్రలో రాజేంద్రప్రసాద్ నటించారు. తను చనిపోయిన తరువాత తన కోసం కుటుంబ సభ్యులు ఎలా బాధ పడతారో చూడాలని ఆ యమ కింకరులను వేడుకుంటాడు. తన శవం పట్ల అతని కన్న బిడ్డలే చూపిన నిర్లక్ష్యం పట్ల యమకింకరులు అతన్ని హేళన చేస్తారు. కానీ బతికి ఉన్నపుడు ఎంతో మందికి సహాయం చేసిన రఘురాంకు నివాళులు అర్పించేందుకు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి అందరు ఆశ్చర్యపోతారు. అతని దగ్గర సహాయం పొందిన వారు అతని కొడుకులకు కూడా బుద్ధి చెపుతారు. అప్పుడు రఘురాంకు తనతో పాటు ఉన్న వారు యమ కింకరులు కారనీ, ప్రశాంతత చెందిన మనస్సుతో చూస్తే వారు దేవదూతలౌతారని తెలుసుకుంటాడు.
ఆ దేవ దూతలు రఘురాంను స్వర్గానికి కొనిపోవడంతో కథ ముగుస్తుంది.అయితే డబ్బు కన్నా మానవతా విలువలు ప్రధానం అని చెప్పేలా ఒక స్టోరీ రాసుకున్నాడు దర్శకుడు.దీనికి అంతిమయాత్ర అని పేరు కూడా పెట్టడం జరిగింది.ఆ తర్వాత ఈ కథతో సీరియల్ తీయవచ్చని ఈటీవీ కి పంపించడం జరిగింది.వారు సీరియల్ గా రిజెక్ట్ చేయడంతో అదే కథను కాస్త డెవలప్ చేసి భాగ్యరాజా దగ్గరకు తీసుకువెళ్లడం జరిగింది.అయితే ఈ సినిమాకు మోహన్ బాబు అయితే బాగుంటుంది అనుకున్నారు కాని ఇదే కథను ప్రకాష్ రాజ్ కు వినిపిస్తే కథ బాగుంది కానీ సినిమా గా పనికి రాదు అని రిజెక్ట్ చేయడం చేశారు. చంద్ర సిద్ధార్థ్ కు ఈ కథను వినిపించగా ఆయన తానే నిర్మిస్తాను అని చెప్పారు..ఈ సినిమా కథను రాజేంద్ర ప్రసాద్ కు చెప్పగా అయ్యన కన్నీళ్లు పెట్టుకొని భావోగ్వేదానికి గురయ్యారు. అలా ఆయన ఒకే చచెప్పడం మిగతా టెక్నీషియన్స్ ఓకే కావడం సినిమా తెరకెక్కి హిట్ కావడం జరిగింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…