Rinku Singh : 5 సిక్సుల వీరుడు రింకు సింగ్‌.. సోష‌ల్ మీడియాలో అపూర్వ స్పంద‌న‌..

Rinku Singh : రింకూ సింగ్.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మారు మోగుతున్న పేరు. ఐపీఎల్ 2023 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్)‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఉత్తర ప్రదేశ్ ప్లేయర్ అసాధారణ ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఒక్క‌సారిగా ఆకర్షించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వరుసగా 5 బంతుల్లో 5 సిక్స్‌లు బాది చిరస్మరణీయ విజయాన్నందించాడు. చివరి 5 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన పరిస్థితిలో ఐదు సిక్స్‌లు బాది కేకేఆర్‌ను గెలిపించాడు. ఈ సంచలన ఇన్నింగ్స్‌తో రింకూ సింగ్ కేకేఆర్ సూపర్ స్టార్‌గా నిలిచిపోయాడు.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (39), సాయి సుదర్శన్ (38 బంతుల్లో 53) రాణించగా.. ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ (24 బంతుల్లో 63 నాటౌట్) అనూహ్య రీతిలో చెలరేగడంతో గుజరాత్ 200 పరుగుల మార్క్ దాటింది. భారీ లక్ష్య చేధనలో కోల్‌కతా త్వరగానే ఓపెనరల్ వికెట్లను కోల్పోయింది. అయితే మూడు ఓవర్లలో కో‌ల్‌కతా విజయానికి 48 పరుగులు అవసరం కాగా.. రింకూ సింగ్ మాత్రమే స్పెషలిస్ట్ బ్యాటర్ కావడం.. అప్పటికీ అతడు 7 బంతుల్లో 4 పరుగుల మాత్రమే చేయడంతో గుజరాత్‌దే గెలుపని అనుకున్నారు.

Rinku Singh viral on social media after his 5 sixes feet
Rinku Singh

కాని రింకూ సింగ్ (21 బంతుల్లో 48) వరుసగా ఐదు సిక్సులు బాది కోల్‌కతాకు ఊహించని విజయాన్ని అందించాడు. దీంతో సోష‌ల్ మీడియాలో రింకూపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. రోహిత్ శ‌ర్మ‌, వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌పై ప్ర‌శంసలు కురిపిస్తున్నారు. ఏదేమైన 2022లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోని జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తాజా సీజన్‌లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. గుజరాత్‌తో ఆడిన తాజా ఇన్నింగ్స్ అతన్ని మరో స్థాయిలో నిలబెట్టింది. చిన్నప్పటి నుంచే రింకూ సింగ్ క్రికెట్ పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడాలనే బలమైన కోరికతో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. సచిన్ టెండుల్కర్, సురేష్ రైనా అతని ఆరాధ్య క్రికెటర్లు. కుటుంబాన్ని పోషించడానికి తండ్రి పడే కష్టంలో తానూ పాలుపంచుకునేవాడు. దీనికోసం ఒకదశలో ఓ ప్రైవేట్ కార్యాలయంలో స్వీపర్‌గా కొద్దిరోజులు పని చేశాడు.

Share
Shreyan Ch

Recent Posts

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 hours ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

23 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago