RGV : ఎప్పుడు వివాదలతో వార్తలలో నిలుస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ ఇటీవల అంబర్ పేట వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి ప్రదీప్ కుటుంబం తరపున గట్టి పోరాటమే చేస్తున్నాడు. తన ట్విట్టర్ వేదికగా అటు ప్రభుత్వాన్ని, ఇటు జంతు ప్రేమికులను.. మధ్యలో వచ్చిన మేయర్ గద్వాల విజయలక్ష్మిని.. ట్వీట్లతో ఏకిపారేశారు. ఈ ఎపిసోడ్‌లో ఆర్జీవీ తన మార్క్ ట్వీట్లే చేసినప్పటికీ.. వాటిల్లో ఎక్కడో ఓ మూల హ్యూమన్ యాంగిల్ అయితే తొంగి చూసింది. మానవతా ధృక్పథం అంటే మీనింగ్ నాకు తెలియదు అంటూ సెటైర్లు వేసే ఆర్జీవీ.. ఈ ఎపిసోడ్‌లో మాత్రం ముందు నుంచి బాధిత కుటుంబ తరఫున తన గొంతు వినిపిస్తూనే ఉన్నాడు.
రీసెంట్‌గా చిన్నారి కుటుంబానికి సాయం చేయండి అంటూ బ్యాంక్ అకౌంట్ నంబర్ ను సైతం సోషల్ మీడియాలో పెట్టారు వర్మ.ఇక తాజాగా కుక్కల్ని ప్రేమించే వారికి టాక్స్ వేయాలి అంటూ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చాడు. ”కుక్కల సంఖ్యను నియంత్రించడానికి ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఉన్న కుక్కలన్నింటిని పట్టుకుని వాటిని ఒక దగ్గర చేర్చి, వాటికి కొన్ని నెంబర్లనో, పేర్లనో పెట్టి జంతు ప్రేమికులకు ఇవ్వండి. లేదా కుక్కల్ని ప్రేమించే వారికి టాక్స్ వేయండి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు వర్మ. ఒకవేళ అది కుదరని పక్షంలో మేయర్ గానీ, అంతకంటే కింది స్థాయి వ్యక్తులు గానీ ఎవరైనా తమ ఆస్తిని కొడుకులకు కాకుండా కుక్కల పెంపకానికి రాసివ్వమనండి అంటూ కాస్త సెటైరికల్ కామెంట్ చేశారు.
రాజ్యాంగ ప్రకారం, చట్టబద్దంగా టాక్స్ వేస్తే నేను కట్టడానికి రెడీ అని వర్మ తెలిపారు. అంతేగాని ఊరికే అడిగితే నేను డబ్బులు ఇవ్వను అని అన్నాడు. ఇక కుక్కల్ని ప్రేమిస్తున్నాం అంటూ తహతహలాడే వారందరికి తప్పక ట్యాక్స్ వేయాలంటూ రామూజీ ఓ ఉచిత సలహా అయితే ఇచ్చాడు. వర్మ నుంచి ఇలాంటి పరిణామం చూసి.. తన పేరు చెబితేనే చీదరించుకునే వాళ్లతో కూడా.. సార్.. మీరు మారిపోయారు సార్.. అనే డైలాగ్ చెప్పేలా చేశాడు ఆర్జీవీ. ఇక బాధితుడి కుటుంబానికి అండగా ఉండాలన్న ఆర్జీవీ అభ్యర్థనకు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…