Pawan Kalyan : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కమెడియన్ ఆలీ ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాలలోను కొనసాగుతున్నారు.ఇటీవల ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కమెడియన్ ఆలీకి ప్రభుత్వ సలహాదారుడిగా కూడా పోస్ట్ కూడా ఇచ్చారు. అయితే అలీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కు ఎంత సన్నిహితంగా ఉండేవారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కమెడియన్ అలీని తన సినిమాల్లో ఉండనిచ్చే విధంగా దర్శకులతో మాట్లాడేవాడు. ఇక చాలా కాలం పాటు వీరి మధ్య స్నేహం కొనసాగింది.
సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వీరీ కాంబినేషన్స్ కు మంచి గుర్తింపు అయితే లభించింది. మధ్యలో మాత్రం రాజకీయపరంగా వీరికి తీవ్రస్థాయిలో విభేదాలు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గత ఎన్నికల్లో ప్రచారాలు నిర్వహించడమే కాకుండా పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆలీ పేరు ఎత్తకుండానే కౌంటర్ ఇచ్చిన ప్రయత్నం చేశారు. దీంతో మీరు మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఈ క్రమంలో పవన్ నటించిన సినిమాలలో అలీ కనిపించడమే మానేశాడు. ప్రస్తుతం పవన్, సాయి ధరమ్ తేజ్ కలిసి తమిళ్ చిత్రం ‘వినోదయ సిత్తం’ రీమేక్‌గా మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు.
రీసెంట్‌గా ఈ సినిమాకి సంబంధించి నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతికా శర్మ ఫిమేల్ లీడ్స్‌గా నటిస్తుండగా, బ్రహ్మానందం , రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే పవన్ సినిమాలలో తప్పక ఉండే ఆలీని కాదని బ్రహ్మానందంకి ఆహ్వానం పంపడంపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం కోసం త్రివిక్రమ్ ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్ రాసినట్లు తెలుస్తోంది. అలీని కాదని, దాదాపు సినిమాలకు దూరంగా ఉంటున్న బ్రహ్మానందంను తీసుకోవడం పట్ల నెటిజన్స్ అనేక ఆలోచనలు చేస్తున్నారు. బయటకు బాగానే ఉన్నామని చెబుతున్నా కూడా లోలోపల ఇద్దరి మధ్య విబేధాలు గట్టిగానే ఉన్నాయని అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…