Amala : తెలుగు రాష్ట్రాలలో డాగ్ టెర్రర్ మొదలైంది. ఏపీ,తెలంగాణల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఓ వైపు మున్సిపాల్టీ సిబ్బంది చర్యలు కొనసాగుతుండగానే.. మరోవైపు గ్రామసింహాలు పిల్లలను టార్గెట్ చేసి గాయపరుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.. మొన్న ప్రదీప్, నిన్న ఆశ్రిత్, ఆ తర్వాత శైలజ్, సహస్రల ఉదంతంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ క్రమంలో వీధి కుక్కల నియంత్రణ చేయాలని కొందరు మండిపడుతుండగా, వాటికి జంతు ప్రేమికులు అడ్డుగా నిలుస్తున్నారు. ఏమాత్రం చర్యలు తీసుకున్నా కోర్టు డైరెక్షన్‌తో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఐతే కుక్కలపై ప్రేమ తప్ప పిల్లలపై ప్రేమ ఉండదా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
బాలుడు మృతి చెందిన ఘటనను వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. విడిచిపెట్టడం లేదు. ఆ ఘటన జరిగిన రోజు నుంచి.. అటు అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. వరుస ట్వీట్లు చేస్తూనే ఉన్నాడు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీని కూడా తన ట్వీట్లతో కడిగిపారేశాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ.. తనదైన స్టైల్‌లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. మరోవైపు రష్మీ, అమల వంటి జంతు ప్రేమికులు మాత్రం వీధి కుక్కలపై ఆగ్రహం చూపించొద్దని కోరుతున్నారు.
రష్మీపై మొన్న వీధి కుక్కలకి పాజిటివ్‌గా ట్వీట్ చేయగా, ఆమెపై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. తాజాగా బ్లూ క్రాస్ సోసైటీ ఆఫ్ హైదరాబాద్ నిర్వాహకులు రాలు అక్కినేని అమల స్పందిస్తూ.. కుక్కల దాడితో బాలుడు మరణించడం చాలా బాధాకరం. అలాగని మొత్తం కుక్కలపై కోపం, ద్వేషం పెంచుకోవడం సరికాదని , వాటిని ఎంతగా ప్రేమిస్తే అవి కూడా తిరిగి ప్రేమిస్తాయని అన్నారు. ప్రస్తుతం కుక్కలన్నింటినీ పారద్రోలినా మళ్లీ జనావాసంలోకి వచ్చే అవకాశం ఉందని, మానవులకు వాటికి మధ్య వేల ఏండ్లనాటి అనుబంధం ఉందని చెప్పింది. నాలుగేళ్ల బాలుడి విషయంలో జరిగిన అన్యాయం పట్ల అమల ఇలా స్పందించడంపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ ఇంట్లోనే ఇలా జరిగి ఉంటే ఊరుకునే వారా అంటూ మండిపడుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…