Revanth Reddy : చంద్ర‌బాబు అరెస్ట్‌పై రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించ‌లేదు అంటే ఇదీ కార‌ణం..!

Revanth Reddy : స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న అరెస్ట్ చేసిన విధానంపై చాలా మంది ఖండించారు.అయితే ఓ ప్రెస్ మీట్‌లో చంద్రబాబు అరెస్ట్‌పై మీ స్పంద‌న ఏంట‌ని రేవంత్‌ని ప్ర‌శ్నించ‌గా, ఆయ‌న ఎట్ల చూస్తాం, అరెస్ట్ మాదిరిగానే చూస్తాం అని సింపుల్‌గా అన్నారు. ఇదే విష‌యంపై ఓ ఇంట‌ర్వ్యూలో రేవంత్‌ని ప్ర‌శ్నించగా, ఆయ‌న దానికి స్పందించారు. ప్ర‌స్తుతం పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్నాను. మాకు కొన్ని విధివిధానాలు ఉంటాయి. నాక ప‌ర్స‌న‌ల్‌గా ఆయ‌న‌కు నాకు ఎంత రిలేష‌న్ ఉన్నా కూడా పార్టీ విధి విధానాల బ‌ట్టి న‌డుచుకోవ‌ల‌సి ఉంటుంద‌ని చెప్పారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు చంద్ర‌బాబు అరెస్ట్‌ని ఖండించారు. తుమ్మల నాగేశ్వ‌ర‌రావు కూడా దానిని త‌ప్పుబ‌ట్టారు. అయితే నేను కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న నేప‌థ్యంలో ఓపెన్‌గా మాట్లాడ‌లేను. ఆయ‌నేంటో నాకు తెలుసు.నేనేంటో ఆయ‌న‌కు తెలుసు. ఎవ‌రు ఏమ‌నుకుంటే మాకేంటి అన్న‌ట్టు రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ ఇచ్చిన క్లారిటీతో అంద‌రిలో ఒక అభిప్రాయం వ‌చ్చింది. అయితే చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత హైదరాబాద్ లో నిరసనలు చేస్తుంటే ఇక్క‌డ‌ చేయాల్సిన అవసరం లేదని కావాలంటే రాజమండ్రిల్లో నిరసనలు చేసుకోవాలని, బాబు అరెస్టుకు హైదరాబాద్‌కి సంబంధం ఏముందని ప్రశ్నించడం సరికాదని కేటీఆర్ అన‌గా దానిని ఖండించారు రేవంత్.

Revanth Reddy told why he did not responded on chandra babu arrest
Revanth Reddy

చంద్రబాబు జాతీయ స్థాయి నాయకుడన్నారు. హైదరాబాద్‌ పదేళ్లపాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అని గుర్తు చేశారు. ఏపీకి సంబంధించిన అంశాలపై ఇక్కడ నిరసన జరపొద్దని అంటే ఎలా అని ప్రశ్నించారు. నిరసనలు వద్దంటూ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. చంద్రబాబు కోసం చేపట్టిన నిరసనలకు రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు.హైదరాబాద్‌లో నిరసనలు తెలిపేవారు ఇక్కడి ఓటర్లే అన్న సంగతి బిఆర్‌ఎస్ నేతలు మరవొద్దని సూచించారు. చంద్రబాబు కోసం నిరసన తెలిపే వాళ్లంతా ఇక్కడి ఓటర్లేనన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago