Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్ ఎన్నిక‌ల అఫిడ‌విట్ ల‌ను బ‌య‌ట‌పెట్టిన రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : మ‌రికొద్ది రోజుల‌లో తెలంగాణ ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి కేసిఆర్,మంత్రులు హరీష్ రావు,కేటీఆర్ సహా అనేక మంది ఎమ్మెల్యేలు,ఎమ్మెల్యే అభ్యర్థులు గురువారం ఆయా నియోజకవర్గాల్లో తమ నామినేషన్లను దాఖలు చేశారు.కేంద్ర ఎన్నికల సంఘానికి వారు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నాయకుల ఆస్తి,ఇతర వివరాలు ఉన్నాయి. అయితే కేసీఆర్‌పై అనేక ర‌కాలుగా ప్ర‌చారాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప‌లువురు క్లారిటీ ఇచ్చారు. వ్యవసాయమే వృత్తిగా భావిస్తూ.. ఎక్కువ సమయం తన వ్యవసాయ క్షేత్రంలోనే గడిపే కేసీఆర్‌కు తన పేరు మీద ఎలాంటి భూమి లేకపోవటమనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అలా అని.. కేసీఆర్‌కు ఆస్తులేమి లేవని కాదండోయ్. ప్రత్యేకంగా ఆయన పేరు మీద ఎలాంటి భూములు లేకపోయినా.. ఉన్న స్థలాలన్ని కుటుంబ ఉమ్మడి ఆస్తులుగా ఉన్నాయంట. కేసీఆర్ కుటుంబానికి మొత్తంగా 53.30 ఎకరాల సాగుభూములు, 9.36 కరాల మేర వ్యవసాయేతర భూములున్నట్టు పేర్కొన్నారు. కాగా.. 4 నెలల కిందే అంటే జులైలో మర్కూక్ మండలంలోని శివారు వెంకటాపురం గ్రామంలో 10 ఎకరాల సాగుభూమిని కేసీఆర్ కుటుంబం కొనుగోలు చేసింది. ఈ భూమి విలువ సుమారు రూ. 28.47 లక్షలుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Revanth Reddy told about cm kcr and ktr real truths
Revanth Reddy

ధరణిని రద్దు చేస్తామని మీరు చెప్పారు. అదే విషయాన్ని కేసీఆర్‌ కూడా ప్రచారం చేస్తున్నారు.. అని ప్ర‌శ్న ఎదురు కాగా, దానికి స్పందించిన రేవంత్ రెడ్డి.. ధరణిని రద్దు చేస్తామని చెప్పిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. ఇంతకంటే మెరుగైన దానిని తీసుకొచ్చి అమలు చేస్తాం. గతంలో కాంగ్రెస్‌ పార్టీయే భూ భారతిని తీసుకొచ్చింది. రికార్డులు డిజిటలైజ్‌ చేయాలనేది మా ఆలోచన! కానీ, కేసీఆర్‌ ఆ రికార్డులను మాయం చేసి, విధ్వంసం చేసి లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు, అసైన్‌మెంట్‌ భూములు, పోడు పట్టాలన్నింటినీ గందరగోళం చేశారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న వేలాది ఎకరాల భూములకు కొత్త యజమానులు పుట్టుకొచ్చారు. పాస్‌ పుస్తకాలు జారీచేశారు. కేసీఆర్‌ ఈ ధరణి పథకంతో రూ.లక్షల కోట్లు సంపాదించారు. 10 వేల ఎకరాల భూమి గోల్‌మాల్‌ అయితే.. ఎకరం పది కోట్లు అనుకున్నా లక్ష కోట్లు అవుతుంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు భూమి 6,500 ఎకరాలు ఉంటుంది అని అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago