Kalvakuntla Kavitha : బ‌హిరంగ స‌భ‌లో క‌ళ్లు తిరిగి పడిపోయిన క‌విత‌.. త‌న హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన కేసీఆర్ త‌న‌య‌..

Kalvakuntla Kavitha : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న విష‌యం తెలిసిందే. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. మొన్న కేసీఆర్ త‌నయుడు కేటీఆర్ ప్ర‌చారంలో పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇక తాజాగా క‌విత క‌ళ్లు తిరిగి ప‌డిపోయింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పృహతప్పి పడిపోయారు. ప్రచార వాహనంలో ఉండగానే.. ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పక్కనే ఉన్న మహిళా కార్యకర్తలు ఆమెకు సపర్యలు చేశారు. అక్కడే ఉన్న గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ప్రాథమిక చికిత్స చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. డీహైడ్రేషన్ వల్ల ఆమె పడిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. కాసేపు విరామం అనంతరం ఆమె తిరిగి ప్రచారాన్ని కొనసాగించారు. మె స్థానికంగా ఉన్న ఓ కార్యకర్త ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఆమె తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. మరోవైపు తాను ఆరోగ్యంగా ఉన్నానని ఎక్స్ వేదికగా ఆమె తెలిపారు. విశ్రాంతి తీసుకున్న ఇంట్లో ఒక చిన్నారితో ముచ్చటించిన వీడియోను ఆమె షేర్ చేశారు. చిన్నారితో గడిపిన తర్వాత తనకు మరింత శక్తి వచ్చినట్టు అనిపించిందని చెప్పారు. డీహైడ్రేషన్ కారణంగా ఆమెకు కళ్లు తిరిగినట్టు తెలుస్తోంది.

Kalvakuntla Kavitha fell unconscious in public meeting
Kalvakuntla Kavitha

బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో గుబులు మొదలైందని, ఆ పార్టీల మైండ్ బ్లాంక్ అయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అందుకే ఆ రెండు పార్టీల నేతలు అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లని, అబద్దాలు చెప్పడంలో బీజేపీ ఆరితేరిందని విమర్శించారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా తమ పార్టీ మ్యానిఫెస్టో ఉందని, అన్ని వర్గాలకు మరింత అభ్యున్నతి కలిగేలా రూపొందించారని తెలిపారు. గ్యారెంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా అంటూ ట్వీట్ చేశారు. ఆరు దశాబ్ధాల పాటూ తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం క్షమాపణలు చెప్పలేరా అని ప్రశ్నించారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago