Payal Rajput : పాయల్ రాజ్‌పుత్.. ఈ అందాల ముద్దగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంగళవారం సినిమాతో రీసెంట్‌గా ప్రేక్షకులని పలకరించిన పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమా హిట్‌తో తన ఖాతాలో మంచి విజయం వేసుకుంది. ఆర్ఎక్స్ 100 చిత్రంతో డైరెక్టర్‌గా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అజయ్ భూపతి తీసిన తాజా చిత్రమే ‘మంగళవారం కాగా, ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని ఇచ్చాడు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రలు చేశారు.
మంగళవారం చిత్రంలో మీకు పాత్ర ఎలా వచ్చింది అని పాయల్‌ని మీడియా అడగగా, దానికి స్పందించిన పాయల్.. నేనే అజయ్‌ని అవకాశం ఇవ్వాలని అడిగాను. అయితే మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు కచ్చితంగా ఇస్తానని.. చిన్న చిన్న పాత్రలకు నన్ను తీసుకోవడం ఇష్టం లేదన్నాడు. మొత్తానికి మంగళవారం సినిమాలో నాకు ఛాన్స్ దక్కింది. తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమా ఓ సంచలనం అవుతుంది. ఎందుకంటే ఇలాంటి పాత్రతో ఇప్పటివరకు ఎవరూ సినిమా తీయలేదు” అంటూ పాయల్ బదులిచ్చింది. శైలూ రోల్ విలన్ కాదు. సినిమా చూసిన తర్వాత మీకు శైలుపై మీకు సానుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్‌లో చాలా రకాలైన ఎమోషన్స్ ఉంటాయి. నేను ఇంతకు ముందు చాలా ఇంటెన్సివ్ రోల్స్ చేశాను.. కానీ ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు. కథ విన్న తర్వాత మళ్లీ అజయ్ భూపతితో కలిసి పనిచేస్తున్నానని మా అమ్మకు చెప్పాను.
ఆడిషన్స్ గురించి తెలిసిన తర్వాత నేను అజయ్ భూపతికి కాల్ చేశాను. నన్ను ఎందుకు కన్సిడర్ చేయడం లేదని అడిగాను. అప్పుడే నా గురించి ఆలోచించారు. ఎందుకంటే ఆయన టాలెంట్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అందుకే మరోసారి కలిసి పనిచేయాలని ట్రై చేశాను అని పాయల్ చెప్పింది. అయితే మంగళవారం విజయం తర్వాత మీడియా ముందు మాట్లాడడానికి వచ్చిన పాయల్‌ని కార్తికేయ ఫ్యాన్స్ తెగ ఇబ్బంది పెట్టేశారు. అయినప్పటికీ పాయల్ చాలా ఓపికగా సమాధానం ఇచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…