Minister Malla Reddy : తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సోషల్ మీడియాలో తరుచూ వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. కొద్ది రోజుల క్రితం ఆయన పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. పైకి వచ్చినా.. అంటూ చెప్పే డైలాగులు చాలా ఫేమస్ అయింది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ తనదైన రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ముసమ్మలను పాసిపాపలా ఒళ్లో కూర్చోబెట్టుకున్నా.. షేర్ బ్యాండ్‌కు స్టెప్పులేసినా.. ప్రత్యర్థిపై పంచుల వర్షం కురిపించినా.. అది మల్లన్నకే సాధ్యం. ఇలా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే మల్లారెడ్డి తన పంచ్ డైలాగులు, డ్యాన్సులు, చేష్టలతో కూడా సందడి చేస్తుంటారు.మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్‌తో పాటు అఫిడవిట్ సమర్పించారు.
2014లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసిన మల్లారెడ్డి తాను.. ప్యాట్నీ గవర్నమెంట్ కాలేజ్‌లో ఇంటర్ చదివినట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక 2018 ఎన్నికల్లో ఆయన మేడ్చల్ అసెంబ్లీకి పోటీ చేయగా.. ఆ సమయంలో తాను వెస్లీ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ చదివినట్లు వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో లక్ష్మీదేవి గవర్నమెంట్ కాలేజ్‌లో ఇంటర్ పూర్తి చేసినట్లుగా పేర్కొన్నారు. ఇలా గత మూడు ఎన్నికల్లో 3 రకాలుగా ఎడ్యూకేషన్ డీటైల్స్ ఇచ్చారు మల్లారెడ్డి. ప్రస్తుతం 2023 మేడ్చల్ నుంచి పోటీ చేస్తున్న సమయంలో ఇచ్చిన అఫిడవిట్ లో ఆయన రాఘవ లక్ష్మీదేవి గవర్నమెంట్ కాలేజీలో 1973లో ఇంటర్ చదివినట్టు పేర్కొన్నారు.
2014లో ఎంపీగా పోటీ చేసినప్పుడు మల్లారెడ్డి వయసు 56 సంవత్సరాలని ఇచ్చారని, ఇప్పుడు వయసు 70 సంవత్సరాలు అని ఇచ్చారని, 2014 నుండి 2023 వరకు 9 సంవత్సరాలే అవుతుందని, అలాంటప్పుడు మంత్రి మల్లారెడ్డి వయసు 70 సంవత్సరాలు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అయితే తాజాగా మల్లారెడ్డి చర్చాఘోష్టిలో పాల్గోన్న మల్లారెడ్డి ఇంటర్‌లో తన కొత్త గ్రూప్ తెలియజేశారు.జీఈసీ గ్రూప్ అని చెప్పిన మల్లారెడ్డి అందరిలో ఆశ్యర్యం కలగజేశాడు. ఈ గ్రూప్ లేదన్న రిపోర్టర్స్‌కి తనదైన శైలిలో బదులిచ్చాడు. నేను మంత్రిగా, ఎంపీగా, ఎంఎల్ గా అవుతానని ఎప్పుడు అనుకోలేదని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…