Revanth Reddy : తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల హడావిడి నడుస్తుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా తామంటే తాము గెలుపుబాట పడుతున్నామని చెబుతున్నారు. దొరల పాలనలో విభజించి పాలించడం ఎప్పటి నుంచో వస్తున్న అనవాయితీ.. ఆరోగ్యంగానే సీఎం కేసీఆర్ ఆదివాసి లంబాడీల మధ్య మనస్పర్ధలు తెచ్చి వారిని వేరు చేశారని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాంగ్రెస్‌ను చూస్తుంటే దొరల గడీలను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోందన్నారు. ఒకనాడు డీలర్‌గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు డాలర్ దయాకర్ రావు అయ్యారని వ్యాఖ్యలు చేశారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు దందాలు చేస్తే… ఝాన్సీ రెడ్డి కుటుంబం పేదలకు సేవలు చేశారని తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు కాలేజీలు, ఆసపత్రుల కోసం 80 ఎకరాల భూమి కొంటే దయాకర్ రావు లిటిగేషన్లు పెట్టి ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు ఈ ఎన్నికల్లో పాలకుర్తిలో ఈ దొరను… తెలంగాణలో ఆ దొరను ప్రజలు ఈ బొంద పెట్టడం ఖాయమని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. ‘కేసీఆర్‌కు సవాల్ విసురుతున్నా… 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. లేకపోతే వరంగల్ ఏకాశిలా పార్కు వద్ద ముక్కు నేలకు రాస్తావా? రేవంత్ రెడ్డి వస్తే తెలంగాణను అమ్ముకుంటాడని కేసీఆర్ అంటుండు.. కేసీఆర్.. 2009లో నువ్వు సికింద్రాబాద్ ఎంపీ సీట్లు అమ్ముకున్నావ్. రాజ్యసభ సీట్లు కూడా అమ్ముకున్న దుర్మార్గుడివి నువ్వు.
ఈ ఎన్నికలు కేసీఆర్ నలుగురు కుటుంబ సభ్యులకు… నాలుగు కోట్ల ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం. దొరల తెలంగాణ కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో నిర్ణయించుకోండి’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.అయితే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. టీవీ9పై ఫుల్ సీరియస్ అవుతున్న ఈ వీడియోలో తొక్కిపట్టి నారతీస్తానని అన్నాడు. అడ్డగోలు పనులు చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారో పండబెట్టి తొక్కి పేగులు తీస్తానని అన్నాడు. పేపర్, టీవీ9 నా కొడుకులు మైకులు తీసుకొచ్చి పెడితే వాటికి వివరించే ఓపిక తీరిక లేదంటూ రేవంత్ రెడ్డి ఒకింత ఘాటుగానే స్పందించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…