KTR : ప్ర‌చార ర‌థంపై నుండి కింద ప‌డ్డ కేటీఆర్.. నా ఆరోగ్యంపై ఆందోళ‌న వ‌ద్దంటూ కామెంట్

KTR : మ‌రికొద్ది రోజుల‌లో ఎల‌క్ష‌న్స్ జ‌ర‌గ‌నుండ‌గా, అన్ని పార్టీల నాయ‌కులు జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు సాగుతున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌లో స్పీడ్ పెంచారు. సిరిసిల్ల బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. కేటీఆర్ సిరిసిల్ల బరిలో నిల్చోవడం ఇది ఐదవసారి. గురువారం ఉదయం సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో మంత్రి కేటీఆర్ నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్‌ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా.. కన్నీళ్లు కావాలా నీళ్లు కావాలా.. స్కీములు కావాలా కాంగ్రెస్ స్కాములు కావాలా అని అడిగారు.

కులం మతం పేరుతో చిచ్చుపెట్టే వాళ్ళు వద్దు. ఢిల్లీ, గుజరాత్‌లకు సామతులం కావొద్దు. వేరేవాళ్లకు అధికారం ఇస్తే తెలంగాణ 50 ఏళ్లు వెనక్కి వెళ్తుంది. సిరిసిల్ల నన్ను మళ్లీ దీవిస్తుంది. సాగునీరు, తాగునీరు ఇవ్వని కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దు. కేసీఆర్ గొంతు నొక్కాలని రాహుల్, మోదీ చూస్తున్నారు. ఢిల్లీ, బెంగుళూరు అనుమతులు మాకు అవసరం లేదు’’ అంటూ కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అయితే జోరుగా నామినేషన్లు కొనసాగుతున్న వేళ ఆర్మూర్ నియోజకవర్గంలో నామినేషన్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్మూరులో నామినేషన్ ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో ప్రచార రథంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న మంత్రి కేటీఆర్ వాహనంపై నుండి ముందుకుపడ్డారు. అయితే స్వల్ప గాయాలు కావడంతో మంత్రి కేటీఆర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టు అయింది.

KTR  fell from vehicle
KTR

ఆర్మూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కు ముందు ఆయన పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి తో పాటు మాజీ ఎంపీ సురేష్ రెడ్డి, మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. అయితే ర్యాలీ ముందుకు సాగుతున్న క్రమంలో కేటీఆర్ ప్రచార రథం డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశాడు. దీంతో కేటీఆర్ ఒక్కసారిగా ముందుకు పడిపోయారు. పక్కనే ఉన్న మాజీ ఎంపీ సురేష్ రెడ్డి పూర్తిగా కింద పడిపోయారు. జీవన్ రెడ్డి కూడా ముందుకు పడిపోయారు. ఇక ఈ ఘటనలో మంత్రి కేటీఆర్ తో పాటు ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. విద్యుత్ తీగలు అడ్డురావడంతో వాహనానికి సడన్ బ్రేక్ వేయ‌గా, ప్రచార రథం పైన ఉన్న రెయిలింగ్ విరిగిపోయింది. అయితే తన ఆరోగ్య పరిస్థితి పైన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago