Chandra Babu : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చాలా వేడివేడిగా సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్రమైన దూషణలు చేసుకుంటూ రాజకీయాలు వేడెక్కేలా చేస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ మాటల తూటాలు పేల్చుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా చంద్రబాబు.. జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. బాబాయ్‌ని చంపి నాపై వేశారు, కోడి కత్తి అని నాపై నింద వేశారు. ఇలా డ్రామాలు ఆడుతున్న వ్యక్తి గురించి ప్రజలు ఆలోచించాలి. 2024లో మీ బిడ్డ వచ్చి మళ్లీ మీకు మంచి చేస్తదని అన్నాడు. ఎక్కడ వస్తది మీ బిడ్డ.. ఇది బిడ్డ కాదు క్యాన్సర్ గడ్డ అని చెప్పాను అంటూ జగన్‌పై చంద్రబాబు పంచ్ విసిరాడాడు.
దీనిని భరించే శక్తి ఎవరికి లేదు. మళ్లీ మేం వస్తున్నామంటూ జనాలని అలా మాయలో పడేస్తున్నాడు. పవన్‌కళ్యాణ్ గురించి ఏవేవో మాట్లాడుతున్నాడు. డబ్బులు ఇచ్చి సర్వేలు చేయిస్తున్నాడు. అన్నీ ఆయనకి అనుకూలంగానే చేయించుకుంటున్నాడు అంటూ జగన్‌ని ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు చంద్రబాబు. ఇక స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెలువరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. క్వాష్ పిటిషన్ పై విచారణ గత నెలలోనే ముగిసింది. తీర్పును ధర్మాసనం రిజర్వ్ లో ఉంచింది. ఈ నెల 23లోగా క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాతే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పై విచారణ జరుపుతామని సుప్రీం తెలిపింది.
ఇక ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. నిడదవోలులో ‘వైఎస్సార్ కాపు నేస్తం’ నాలుగో విడత ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. పేద కాపు మహిళలకు, ముఖ్యంగా ఒంటరి మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే లక్ష్యమని అన్నారు. లంచాలకు అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నామని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం ఈ కార్యక్రమం అమలు చేయలేదని సీఎం చెప్పారు. కులం, మతం రాజకీయాలు చూడకుండా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అర్హత ఉంటే చాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నామని తెలిపారు. దీనిని పలువురు తప్పు పడుతున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…