Revanth Reddy : గెలిచాక గొప్ప‌గా మాట్లాడిన రేవంత్.. కేసీఆర్‌ని కూడా క‌లుపుకుపోతానంటూ కామెంట్

Revanth Reddy : తెలంగాణ ఎన్నిక‌లు ముగిసాయి.కాంగ్రెస్ మంచి విజ‌యం సాధించింది.అయితే సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తార‌ని అంద‌రిలో ఉత్కంఠ నెల‌కొని ఉండ‌గా, దాదాపు క్లారిటీ వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తెర దించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసింది. సీఎల్పీ సమావేశం ఆమోదించిన తీర్మానానికి అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశం కొద్ది సేపటి కిందటే ముగిసింది. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పరిశీలకుడు- కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాకరే, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు.

ఈ భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క లేవదీసిన అంశాల పట్ల వివరణ ఇచ్చింది. మల్లికార్జున ఖర్గే- వారితో వేర్వేరుగా మాట్లాడారు. ఈ సాయంత్రానికి రేవంత్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నెల 7వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రానికి ఆయన మూడో ముఖ్యమంత్రి అవుతారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తొలిసారిగా ప్రభుత్వాన్ని నెలకొల్పనుంది.

Revanth Reddy sensational comments after winning
Revanth Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీని గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన రేవంత్.. ప్రగతి భవన్‌ను అంబేద్కర్ ప్రజాభవన్‌గా పేరు మారుస్తామని రేవంత్ ప్రకటించారు. సచివాయం గేట్లు సామాన్యులకు తెరిచి ఉంటాయని టీపీసీసీ చీఫ్ తెలిపారు. కాంగ్రెస్ విజయాన్ని కేటీఆర్ అభినందించారు. వారిని స్వాగతిస్తున్నా. ప్రజాతీర్పుకు తలవొంచి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్షం సంపూర్ణంగా సహకరించి.. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో ప్రతిపక్షాలన్నింటికీ ఆహ్వానం పలుకుతాం’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.ప్రగతి భవన్ ప్రజల ఆస్తి, దాన్ని ప్రజలకోసమే వినియోగిస్తాం. 2004 నుంచి 2014 వరకు ఏరకంగా ప్రజాస్వామిక పరిపాలనను దేశంలో కాంగ్రెస్ పార్టీ అందించిందో.. తెలంగాణలోనూ అదే స్ఫూర్తితో ముందుకెళ్తాం అని ఆయ‌న చెప్పారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago