Chandra Babu : తెలంగాణలో కాంగ్రెస్ ఎవరు ఊహించని విజయాన్ని చవిచూసింది. అరవైకి పైగా స్థానాలు దక్కించుకొని ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ ఇలాంటి విజయం సాధించడం వెనక రేవంత్ రెడ్డి కృషి ఉందని చాలా మంది చెప్పుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి గెలుపుపై ఒక్కొక్కరు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఓడిపోవడం సంతోషంగా ఉందని.. అవినీతి పాలనను ప్రజలు అంతిమొందిచారన్నారు.
రేవంత్ రెడ్డి పెద్ద ఫైటర్ అని. కేసీఆర్ ఏకైక టార్గెట్ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ తెలిపారు. రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గ్రౌండ్ లెవల్ నుంచి వచ్చిన ఫైటర్. అందులో ఎలాంటి అనుమానం లేదని బండి సంజయ్ అన్నారు. ఇక చంద్రబాబు సైతం రేవంత్ రెడ్డి గెలుపుపై తనదైన శైలిలో స్పందించారు. నేను ఆధ్యాత్మిక ప్రాంతంలో ఉన్నాను. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడను. సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పక మాట్లాడతానంటూ ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. కాంగ్రెస్ పార్టీ నుండి పాలనా పగ్గాలు చేపట్టబోతున్న రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు శిష్యుడు కావడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. తెలంగాణ మొదటి సీఎం ఆయన శిష్యుడే, తెలంగాణ రెండవ సీఎం కూడా చంద్రబాబు శిష్యుడని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
రేవంత్ రెడ్డి గెలుపు తర్వాత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో మంచి పరిపాలన అందించే వ్యక్తికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీల పరంగా కాకుండా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన అందించే వ్యక్తి అని, అందుకే ఆయనకు మద్దతు ఇచ్చామని తెలిపారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు శిష్యుడే అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎంపిక అయితే ఆంధ్రప్రదేశ్ కు మంచి జరుగుతుందని అన్నారు. ఐదు నెలల్లో జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…