Renuka Chowdary : తెలంగాణ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో రాజకీయం మరింత వేడెక్కిపోతుంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అలానే ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు. ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ గాలి వీస్తోందని రేణుకా చౌదరి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైనంత మెజారిటీ తప్పకుండా సాధిస్తామని, సీఎం ఎవరనేది గెలిచిన ఎమ్మెల్యేలు, అధిష్టానం నిర్ణయిస్తారని చెప్పారు. డీకే శివకుమార్‌లా పదవిని త్యాగం చేసే గుణం అందరిలో ఉండాలంటూ సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సీట్లను ఖచ్చితంగా గెలుస్తామంటూ రేణుకా చౌదరి పేర్కొన్నారు.
ఏపీలో నేను పోటీ చేయాలని, ప్రచారం చేయాలని ఆహ్వానం ఉంది.. ఏపిలో నరకం అనుభవిస్తున్నారు.. విభజన జరిగినా సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. చంద్రబాబు అరెస్ట్ తీరుని రేణుకా ఖండించగా,ఇప్పడు ఆయన తెలంగాణలో పోటీ చేయకపోవడంపై కూడా ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. బేరం పెట్టుకోకుండా పెద్దమనసుతో కాంగ్రెస్ గెలవాలని వారు పోటీ చేయకుండా ఉండడం గొప్ప విషయం . ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అందరు కలుస్తున్నారు. హస్తానికి ఐదు వేళ్లు ఎలా ఉన్నాయో అలానే అందరు కలిసి గెలవాలని కోరుకుంటున్నారు అని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. తెలుగుదేశం పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఎఫెక్టు పడిందన్నారు.
పువ్వాడ అజయ్ దుష్టుడు, దుర్మార్గుడు అంటూ రేణుక విరుచుకుపడ్డారు. ఆయన డీఎన్ఏలోనే లోపం ఉందని విమర్శించారు. ఎవరూ కూడా నిస్సహాయంగా ఉండొద్దని… ఓటు అనే ఆయుధంతో అజయ్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మన భవిష్యత్తు కోసం తుమ్మల నాగేశ్వరరావును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ఎన్నికలు చరిత్రలో మిగిలిపోతాయని అన్నారు. తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…