Barrelakka : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బర్రెలక్క అలియాస్ శిరీష హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం ఎన్నికల బరిలో దిగి.. తెలంగాణలో ఓ సంచలనంగా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క పోటీ చేస్తున్నా.. తనకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు బరిలో దిగేందుకు నిర్ణయించుకున్న బర్రెలక్కకు.. కేవలం యువత నుంచే కాదు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. పార్టీలకతీతంగా కొందరు రాజకీయ నాయకులు కూడా ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ గెలవాలని కోరుకుంటున్నారు. ఒంటరిగా నామినేషన్ వేసిన బర్రెలక్క వెంట ఇప్పుడు ఓ సైన్యమే కదులుతోంది.
ఆమెతో ఏమవుతుంది అని అనుకున్నవాళ్లకి ఇప్పుడు టెన్షన్‌తో చెమటలు పడుతున్నాయి. సో కాల్డ్ రాజకీయ పార్టీలలా.. వేల కోట్ల ముచ్చట్లు ఆమె చెప్పట్లేదు. సామాన్యునికి కావాల్సిన కనీస మౌలిక సదుపాయల గురించి.. సగటు నిరుద్యోగి బాధల గురించే ప్రచారంలో ప్రస్తావిస్తూ.. అందరినీ ఆలోచింపజేస్తోంది బర్రెలక్క. ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చినా.. దాడులు జరిగినా.. పోలీసులు రక్షణ కల్పించకపోయినా.. మొక్కవోని ధైర్యంతో.. తనతో కలిసి నడుస్తున్న యువతే కొండంత అండగా ముందుకు సాగుతోంది. తాను కచ్చితంగా గెలుస్తానని.. అది కూడా మంచి మెజార్టీతో విజయం సాధిస్తానంటూ కాన్ఫిడెంట్‌గా చెప్తోంది.
బర్రెలక్కనా.. ఆమె వల్ల ఓ వెయ్యో.. రెండు వేల ఓట్లో చీలుతాయి కావొచ్చు.. అంతకంటే మాకు కలిగే నష్టమేమి లేదు.” అంటూ.. కనీసం ఆమెను లెక్కకు కూడా తీసుకోకుండా మాట్లాడిన నాయకులే ఇప్పుడు ఆందోళన చెందాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అనేది చర్చనీయాంశం అయింది. బర్రెలక్క నిజాయితీ చూసి చాలా మంది ఆమెకి కొంత మనీ పంపాలని భావించారు. అయితే ఆమె ఫోన్ పే, జీ పే పని చేయించుకుండా చేశారని బర్రెలక్క అంటుంది. ఎవరు ఎంత పంపిన అది ఫెయిల్డ్ అని వస్తుంది. నాకు రెండు కోట్ల రూపాయలు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. నిజంగా అంత మనీ నాకు వస్తే వాటన్నింటిని కూడా ప్రజా సేవకే ఉపయోగిస్తానంటుంది బర్రెలక్క.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…