Renu Desai : రేణూ దేశాయ్… ఈ అమ్మడు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ భార్య, కాని ఇప్పుడు మాత్రం పవన్ మాజీ సతీమణి. కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్‌కి దూరంగా ఉంటున్న రేణూ దేశాయ్ తన పిల్లలతో కలిసి పూణేలో సంతోషంగా ఉంటుంది. ఇక వీలున్నప్పుడల్లా తమ పిల్లలకి సంబంధించిన విషయాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే పవన్ నుండి విడిపోయిన తర్వాత రేణూ దేశాయ్.. ఆయన జ్ఞాపకాలని పూర్తిగా తుడిచేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. పవన్ కళ్యాణ్ మాజీ భార్య అని అనడాన్ని అస్సలు అంగీకరించని రేణూ దేశాయ్ తన పిల్లలను సైతం పవన్ కళ్యాణ్ పిల్లలు అనడాన్ని ఆమె అంగీకరించడం లేదు.
ఆ మధ్య అకీరాను ‘మా అన్న కొడుకు’ అని ఒక పవన్ కళ్యాణ్ అభిమాని అన్నందుకు రేణూ దేశాయ్ చాలా కోపంగా రియాక్ట్ అయ్యారు. అకీరా తన కొడుకు అని గట్టిగా చెప్పారు. దీంతో కొంత మంది రేణూ దేశాయ్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వారికి రేణూ దేశాయ్ ఘాటుగానే బదులిస్తూ ఉంటుంది. అయితే ఓ సారి రేణూ… ఉత్తేజ్ కూతురు పాటతో తన సినిమా సాంగ్స్ తో పాటు మెగా ఫ్యామిలీ హీరోల సాంగ్స్ పాడిపించుకుంది. పవన్ వకీల్ సాబ్ లోని మగువా మగువా అనే పాట కూడా పాడిపించుకోగా.. రేణూకి పవన్ మీద ఎంతో కొంత ప్రేమ ఉందని చెప్పుకొస్తున్నారు.
కాగా, రేణూ దేశాయ్ ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటూ తన తనయుడిని చూసుకుంటూ మురిసిపోతుంది. ఇటీవల అకీరా జిమ్ వీడియో షేర్ చేసింది. ఇందులో… ‘అకీరాను జిమ్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ పాటలకు బదులుగా మాతృభాషలో పాటలు వినాలని నేను ప్రోత్సహించేదాన్ని. ఇప్పుడు అదే పాటిస్తూ అకీరా తెలుగు/హిందీ పాటలు వింటూ జిమ్ చేయడం గర్వంగా ఉంది. నేను జిమ్ లో ఇంగ్లీష్ పాటలకు బదులు హిందీ పాటలు ప్లే చేయాలని అడిగిన సందర్భంలో నన్నో పిచ్చిదానిగా చూసేవారు. వాటిని నేను పట్టించుకోలేదు. ఇప్పుడు నేను చెప్పిందే అకీరా చేస్తున్నాడు. నేటి యువత కూడా మాతృభాషకు గౌరవం ఇస్తారని ఆశిస్తున్నాఅని రేణూ పేర్కొంది. కాగా, 20ఏళ్లుగా నటనకు దూరంగా ఉన్న రేణూ దేశాయ్ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…