Pawan Kalyan : సినిమాలలో ఉన్నప్పుడు సైలెంట్‌గా కనిపించిన పవన్ కళ్యాన్ ఎప్పుడైతే రాజకీయాలలోకి వచ్చారో ఆయన తన ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుండి తనని విమర్శించే ప్రతి ఒక్కరిపై విమర్శనాస్త్రాలు కురిపిస్తున్నారు. ఇటీవల పిఠాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో అన్నవరం గుడిలో తన చెప్పుల చోరీ గురించి చెబుతూ పరోక్షంగా ఏపీ మాజీ మంత్రి పేర్ని నానికి జనసేనాని పవన్ కౌంటరిచ్చారు. తాను తెల్ల దుస్తుల్లో కాకుండా ఇలా వేరే కలర్ డ్రెస్సులో ఎందుకు వచ్చానో మీకు డౌట్ రాలేదా అన్నారు.
తనకు ఇష్టమైన రెండు చొప్పులు ఎవరో దొంగిలించారని, మీకు కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పిచండి ప్లీజ్ అని పవన్ అనేసరికి అక్కడ అరుపులు, కేకలతో దద్దరిల్లింది. వైసీపీ ప్రభుత్వం గుడిలో నా చెప్పులు కూడా పట్టుకుని వెళ్లిపోయిందని, ఇంతకు దిగజారిందని వ్యాఖ్యానించారు. అలానే వైసీపీ ప్రభుత్వం గూండాలకి నిలయం అని, తాము అధికారంలోకి వచ్చాక ఒక్కో వైసీపీ గూండాను బట్టలు విప్పి కొడతామని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల కొందరు జనసైనికులు పవన్ కళ్యాణ్ .. ఆర్జీవి గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారని అభిప్రాయపడ్డారు.
గత కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్… ఆర్జీవి కామెంట్స్ ఓపికగా భరిస్తూ వస్తున్నారు. ఇటీవల వర్మ తన వ్యూహం టీజర్ రిలీజ్ చేయగా, ఇందులో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల పాత్రలను కూడా పరిచయం చేశాడు. ఈ మేరకు ఓ ఫోటోను రిలీజ్ చేశాడు. అందులో పవన్ చిరంజీవితో ఏదో మాట్లాడి తిరిగి వెళ్లిపోతున్నట్టుగా తెలుస్తోంది. మరి మూవీలో ఈ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్‌ని వర్మ టార్గెట్ చేయగా, ఆయనని ఈ మధ్య జరిగిన సభలో ఇన్‌డైరెక్ట్‌గా క్లాస్ పీకినట్టు తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…