Ponguleti Srinivas Reddy : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మన దేశంలో క్రియాశీలక రాజకీయ నాయుకుడు. ఖమ్మం నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడు. 2013లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన ఏడాది కాలంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు.. అంతలోనే పార్లమెంట్ సభ్యుడిగా విజయబావుటా ఎగురవేసారు… తనతో పాటు మరికొందరిని చట్ట సభలకు పంపి.. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సత్తా చాటిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ప్రజాబలంతో తిరుగులేని నాయకుడిగా ఎదిగి.. కేసీఆర్ పిలుపు మేరకు గులాబీ కండువా కప్పుకున్న ఆయన.. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
సరిగ్గా 7 ఏళ్ల పాటు పార్టీలో కొనసాగిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ బంధం.. చివరకు బహిష్కరణ వేటుతో ముగిసింది. పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలు చేయడంతో పాటు కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అతనిని సస్పెండ్ చేసింది. దీంతో పొంగులేటి ఏ పార్టీలో చేరతాడా అని అందరిలో సందేహాలు ఉండగా, ఎట్టకేలకు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నాడు. అంతకముందు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పార్టీని బీఆర్ఎస్‌లో విలీనం చేసిన పొంగులేటి తన రాజకీయ భవిష్యత్ కేసీఆర్‌తోనే అన్నాడు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలలో అధికార పార్టీకి దక్కిన ఫలితాలు , తర్వాత పరిణామలు పార్టీకి, పొంగులేటికి మధ్య దూరాన్ని పెంచాయి.
కల్లూరు ప్రభుత్వ స్కూల్‌లో చదువకున్న పొంగులేటి ఇంజనీరింగ్ కోసం మహారాష్ట్ర వెళ్లారు. అక్కడ నచ్చక మళ్లీ వచ్చేసి కల్లూరులోని ప్రభుత్వ కాలేజ్‌లో ఇంటర్ విద్యను, హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్యలో బిఏ డిగ్రీని పూర్తిచేశాడు. ఈయనకు 1992, మే 8న మాధురితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (హర్షారెడ్డి), ఒక కుమార్తె (సప్ని) ఉన్నారు. 1985లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామోదయ పథకంలో పేరువంచ మేజర్‌పై క్రాస్‌వాల్ నిర్మాణం చేశాడు. ఆ క్రాస్‌వాల్ నిర్మాణం వల్ల 450 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. అలా కాంట్రాక్టర్‌గా మారి ప్రభుత్వం తరపున అనేక నిర్మాణాలు చేశాడు.
నవంబరు 4, 1959న నారాయణపురం, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లాలో జన్మించారు పొంగులేటి. మొదట్లో మంచి కాంట్రాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన అనుకున్న సమయంలో పనులు చేస్తాడని పేరుంది.పొంగులేటి తన కుమార్తె పెళ్లి కోసం బాహుబలి సెట్ వేసి అంగరంగ వైభవంగా జరిపించారు.అతనిని అందరు రాజకీయ నాయకుడిగా కాకుండా బంధువుగా భావిస్తుంటారు. ఇక పొంగులేటి కాంట్రాక్టర్గా పని చేయడం, అలానే రాజకీయాలలోను సత్తా చూపడంతో కోట్లు సంపాదించడట. ఎన్ని కోట్ల ఆస్తులు ఉండి ఉంటే తన కూతురి పెళ్లి అంత అంగరంగ వైభవంగా జరిపించాడని పలువురు ముచ్చటించుకుంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…