Pawan Kalyan : గత కొద్ది రోజులుగా వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ .. వైసీపీ నాయకులని టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం గుప్పించాడు. ముఖ్యమంత్రి జగన్ నుండి మొదలు పెట్టుకొని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలపై కూడా ఫైర్ అయ్యాడు. అయితే పవన్ చేస్తున్న విమర్శలని వైసీపీ నాయకులు తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ..పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.హీరోయిన్ హనీ రోజ్ తో పోలుస్తూ ఆయనను దారుణంగా అవమానించే విధంగా మాట్లాడారు కేతిరెడ్డి.
పవన్ కళ్యాణ్ ఒక ఫ్రెష్ ఫేస్. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఫ్యాన్స్ కానీ, సానుభూతిపరులు కానీ కోరుకోవచ్చు. అతను నాయకుడు కావాలి, పీఠమెక్కాలి అని అతనికి సంబంధించిన వాళ్లంతా కోరుకుకుంటుంటే.. అతను మాత్రం వేరేవాళ్ల పల్లకీలు మోయాలని ఆలోచిస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అవుతాడంటే జనాలు ఓట్లు వేస్తారు కానీ.. ఇంకొకరి పల్లకీలు మోస్తానంటే, చాల్లే నాయనా నీదేందైనా ఉంటే చెప్పు అంటారు. ఆయన కోరిక తాను గెలవాలని ఉండాలి కానీ వేరేవాళ్లను ఓడించాలని కాదు. తిరుపతిలో ఒకవైపు హనీ రోజ్ కార్యక్రమం జరిగితే, మరొకవైపు పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగితే అయితే పవన్ కళ్యాణ్ మీటింగ్ కంటే హనీ రోజ్ కార్యక్రమానికి ఎక్కువ జనం వెళ్తారు అంటూ పవన్ కళ్యాణ్ ని అవమానించే విధంగా మాట్లాడారు కేతిరెడ్డి.
రాజకీయాల్లో ప్రాథమిక అంశాల మీద అవగాహన లేకుండా వచ్చినవాళ్లంతా మా జనాలే అనుకుంటే తప్పు అని జనసేనానిపై కేతిరెడ్డి విమర్శలు గుప్పించారు.సినిమా గ్లామర్ చూసి జనాలు రావడం అనేది కొత్తేమీ కాదు. సినిమా వాళ్లు మీటింగ్‌లు పెడితే జనాలు ఎప్పటి నుండో వస్తున్నారు అని అన్నారు కేతిరెడ్డి. అయితే ఆయన వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. నువ్వొస్తావో, బైరెడ్డి వస్తావో తేల్చుకుందాం రా.. జగన్, పేర్ని నాని ,రోజా వంటి వారు చేసే పనులని సపోర్ట్ చేస్తున్నావా, నీకు హనీరోజు మీద అంత మోజు ఉందా అని ఫైర్ అయినట్టు టాక్ నడుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…