Renu Desai : పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణూ దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పవన్ నుండి విడిపోయిన తర్వాత రేణూ దేశాయ్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికరమైన పోస్ట్‌లతో వార్తలలో నిలుస్తూ ఉంటుంది.ప్రేమ వివాహం చేసుకున్న పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ 2016లో విడాకులు తీసుకొని విడిపోగా, వీరి ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్య ఉన్నారు. ప్రస్తుతం అమ్మ రేణూ దేశాయ్ దగ్గరే పెరుగుతున్నారు. విడాకుల అనంతరం రేణూ పూణే వెళ్లిపోగా, అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వెళుతూ ఉంటుంది.
రేణూ దేశాయ్ ఒక్కోసారి సోషల్ మీడియాలో తన భావాలను కవిత్వం రూపంలో వర్ణిస్తుంటుంది. అందులో ఎన్నో నిగూఢ అర్థాలు మనకు కనిపిస్తుంటాయి. మండుటెండలో ఇలా చల్లని మేఘాల్లా మన జీవితంలోకి కొందరు అనుకోకుండా వస్తారు.. చూపుల్తోనే మన మనసుల్లో గుచ్చేస్తుంటారు.. మాట్లాడుతుంటారు.. అదొక అంతుచిక్కని మూగ భాషలా.. కొన్ని గంటలే వారి గడపొచ్చు గాక.. కానీ వారి ముద్ర, వారి ప్రభావం మనపై జీవితాంతం ఎక్కువగా ఉంటుంది.. అయితే అందులోని చాలా ప్రయాణాలు బాధతో ఉంటాయి… మరి కొంత మంది మన జీవితాల్ని పరిపూర్ణం చేస్తారు.. మన కన్నీళ్లని తుడిచి మన జీవితంలో కొందరు కాంతిని పంచుతారు. నవ్విస్తారు అంటూ రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.
తనను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళను తలచుకుని రేణు దేశాయ్ బాధపడుతున్నట్లుగా ఆ సందేశం ఉంది. మరి ఎవరు తనని వదిలి వెళ్లారు, ఎవరు బాధపెట్టారు. ఎవరి గురించి ఆ పోస్ట్ అన్న దాని విషయంలో మాత్రం క్లారిటీ లేదు. రేణూకి ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు. పెళ్లి ఆలోచనకు బ్రేక్ పడడంతో ఆమె ఇటీవల ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. మకాం పూణే నుండి హైదరాబాద్ కి మార్చారు. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది రేణూ.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…