Renu Desai : రేణు దేశాయ్ .. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా, సినీనటిగా ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. పవన్‌తో విడాకుల తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి సోలోగా ఉంటుంది. పిల్లలిద్దరిని తీసుకొని పూణేకి వెళ్లి అక్కడే ఇండివిడ్యువల్‌గా జీవిస్తుంది. సినిమాలకి దూరంగా ఉంటున్న ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సామాజిక సమస్యలపై స్పందిస్తుంది. రీసెంట్‌గా ఫండ్ రైజ్ కోసం ఆమె వేసిన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. పెట్స్ కోసం రైస్ అవసరం ఉందని, నెలకు మూడు వందల కేజీల రైస్ అవుతోందని, ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయండని ఓ పోస్ట్‌ను వేశారు.
ఆ పోస్ట్‌ని రేణూ దేశాయ్ షేర్ చేస్తూ.. అందరినీ కోరింది. తాను ఆల్రెడీ 50 కేజీల రైస్ ఇచ్చేశానని, మిగిలింది అందరూ కలిసి ఎంతో కొంత సాయం చేయండని వేడుకున్నారు. మాకు ప్రతి నెలా 300 కేజీల బియ్యం అవసరమవుతూ ఉంటుంది. 4 మంది సభ్యులున్న కుటుంబానికి ప్రభుత్వం నుండి 24 కేజీల బియ్యం అందుతుంది. కాబట్టి దయచేసి మీరు మాకు విరాళం ఇస్తే బాగుంటుంది. 10 కుటుంబాలు అలా రేషన్ అందిస్తే.. కుక్క పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ తో ఈ విషయాన్ని షేర్ చేయండి అంటూ రేణూ దేశాయ్ తన పోస్ట్‌లో కోరింది.
ఇక దీనిపై వెంటనే స్పందించిన హీరో అడివి శేష్.. . ఓ పెట్‌కు ట్రీట్మెంట్ అవసరం ఉండటంతో.. పదిహేను వేలు పంపించాడట. అలా వెంటనే స్పందించి సాయం చేసిన అడివి శేష్‌ను రేణూ దేశాయ్ పొగిడేసింది. అడివి శేష్ రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరోనే అంటూ పొగిడేసింది. అయితే అడివి శేష్ కూడా పెట్ లవర్ అన్న సంగతి తెలిసిందే. తన ఇంట్లోనూ పెట్స్‌ను పెంచుతుంటాడు. రేణూ దేశాయ్, అకిరాతో అడివి శేష్ ఎంతో క్లోజ్‌గా ఉంటాడన్న విషయం మనకు తెలిసిందే. అడివి శేష్, అకిరాలు కలిసి బాస్కెట్ బాల్ ఆడుతుంటారు. రేణూ దేశాయ్ ఫ్యామిలీతో అడివి శేష్ ఎక్కువగా కలిసి ఉంటాడు. తరచు వారికి సంబంధించిన పలు విషయాలు షేర్ చేస్తూ ఉంటాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…